Chiranjeevi and Dil Raju : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్నారు. అయితే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియాలో నెంబర్ వన్ ఇండస్ట్రీ గా కొనసాగడమే కాకుండా వివాదాల బారిన కూడా పడుతూ నేషనల్ మీడియాలో నిలుస్తోంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా ప్రత్యేకమైన గుర్తింపైతే ఉంది. దాదాపు 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో స్టార్ హీరో గా వెలుగొందుతున్న ఆయన ఇండస్ట్రీకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ముందు నిలబడి ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ వెతికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక ఇంతకుముందు ఏపీ గవర్నమెంట్ టిక్కెట్ రేట్లు తగ్గింపు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా ఆయన సీఎం జగన్ మోహన్ రెడ్డి తో మాట్లాడి దానికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేశాడు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కి సంబంధించిన కేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో ఇప్పటికే తను డిస్కషన్స్ చేసినట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి…ఇక రీసెంట్ గా దిల్ రాజు మాత్రం సినీ ప్రముఖులతో కలిసి రేవంత్ రెడ్డితో మీటింగ్ ని పెట్టారు. ఇక మొత్తానికైతే ఈ మీటింగ్ లో చాలావరకు నిర్ణయాలను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ నిర్ణయాల వెనక చాలా కీలకమైన మార్పులు జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే దిల్ రాజు సారధ్యంలో జరిగిన ఈ మీటింగ్ కి చిరంజీవి మాత్రం హాజరు కాలేదు. కారణం ఏంటి అనేది పక్కన పెడితే దిల్ రాజు చిరంజీవిని పట్టించుకోలేదా? అందుకే చిరంజీవికి ఆహ్వానం వెళ్లలేదా అని చాలామంది సినీ ప్రముఖులతో పాటు సినీ విమర్శకులు సైతం దిల్ రాజు పైన కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు…
అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి ఇండియాలో లేడు… ఇతర కంట్రీల్లో ఉన్నాడు కాబట్టి తను ఆ మీటింగ్ కి హాజరు కాలేదనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఈ మీటింగ్ కి హాజరు కాకపోయినా కూడా చిరంజీవి సీఎం రేవంత్ రెడ్డి తో ఫోన్ లో మాట్లాడినట్టుగా తెలుస్తోంది.
ఇక ఇండస్ట్రీ కి సంబంధించిన కీలక నిర్ణయాలను తీసుకోవడంలో రేవంత్ రెడ్డి భారీ నిర్ణయాలను అయితే వెలిబుచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట హీరోల టిక్కెట్ రేట్లు పెంపునకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి జారీ చేశారు.
దాంతో పాటుగా అడ్రస్ విషయంలో హీరోలు కొన్ని యాడ్స్ ని చేసి యువత డ్రగ్స్ బారిన పడకుండా వాళ్లని మోటివేట్ చేయాలని ఒక నిర్ణయానికి కూడా తీసుకొచ్చారు. ఇలా కనక తీసుకొస్తే వాళ్లకి టికెట్ రేట్లను పెంచుకోవడానికి గాని పన్నుల్లో రాయితీని గాని కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. మరి ఈ నిర్ణయానికి ఏకీభవించిన సినిమా పెద్దలు అందరూ దీనికి కట్టుబడి ఉంటారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…