Site icon OkTelugu

Dil Raju vs Mythri Movie Makers: దిల్ రాజు vs మైత్రి మూవీ మేకర్స్.. వీళ్లలో ఎవరు టాప్ ప్రొడ్యూసర్స్..?

Dil Raju vs Mythri Movie Makers

Dil Raju vs Mythri Movie Makers

Dil Raju vs Mythri Movie Makers: సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఎవరి సినిమాలు ఎక్కువ విజయాలను సాధిస్తాయి. ఎవరు టాప్ ప్రొడ్యూసర్ గా మారతారు అనే విషయాల మీద గత కొద్దిరోజులుగా తీవ్రమైన చర్చలైతే జరుగుతున్నాయి. ప్రస్తుతం దిల్ రాజు సక్సెస్ ల పరంగా చాలా టాప్ లో ముందుకు సాగుతున్నాడు. ఇక మైత్రి మూవీ మేకర్స్ సైతం భారీ బడ్జెట్ తో సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ఇక వీళ్ళతో పాటుగా నాగ వంశీ, అల్లు అరవింద్ లాంటి వాళ్లు సైతం ప్రస్తుతం టాప్ ప్రొడ్యూసర్స్ గా ముందుకు సాగుతున్నారు… ప్రొడ్యూసర్ల మధ్య తీవ్రమైన పోటీ ఉంది వాళ్ళు ఇతర ప్రొడ్యూసర్స్ నుంచి ఎలాంటి సినిమాలు వస్తున్నాయి. మనం ఎలాంటి సినిమాలు చేస్తే ఇండస్ట్రీలో సక్సెస్ ని సాధించొచ్చు అని ఎప్పటికప్పుడు బెరీజులు వేసుకుంటూ మరి సినిమాలు చేస్తున్నారు. దీని వల్ల హీరోలకు విపరీతంగా రెమ్యూనరేషన్స్ పెంచేసి మన డేట్స్ ని బ్లాక్ చేసుకుంటున్నారు… ఈ క్రమంలోనే దిల్ రాజు మైత్రి మూవీ మేకర్స్ మధ్య విపరీతమైన పోటీ నడుస్తుంది.

ఇక వాళ్ళలో ఎవరు పై చేయి సాధిస్తున్నారు ఎవరు ముందుకు సాగుతున్నారంటే, దిల్ రాజ్ చాలా క్వాలిక్లేటేడ్ గా సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు వెళుతుండగా మైత్రి వాళ్ళు మాత్రం భారీ బడ్జెట్ తో సినిమాలను చిత్రీకరించి దానిని ఎలాగైనా సరే క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నారు.

ఇక మైత్రి వాళ్లు పుష్ప 2 సినిమాతో పదిమందిలో కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టారు. అయితే దిల్ రాజు ఇప్పటివరకు అంత మొత్తంలో కలెక్షన్స్ ను అయితే రాబట్టలేదు. దానికి తోడుగా ఆయన భారీ బడ్జెట్ సినిమాలను కూడా పెద్దగా చేయడం లేదు. గతంలో చేసిన గేమ్ చేంజర్ సినిమా సక్సెస్ సాధించకపోవడంతో దాదాపు 200 కోట్ల వరకు నష్టమైతే వచ్చింది.

ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో 350 కోట్లకు పైన సినిమా కలెక్షన్స్ ను రాబట్టి ఆ నష్టాన్ని భర్తీ చేసుకున్నాడు… రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు నిర్మాతల్లో ఎవరు టాప్ ప్రొడ్యూసర్ గా మారతారు అనేది తెలియాలంటే మాత్రం ఇంకో సంవత్సరం పాటు వెయిట్ చేయాల్సిన అవసరమైతే ఉంది…

Exit mobile version