Dil Raju: అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘F3’ సినిమా రేపు రిలీజ్ కాబోతుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు. అయితే, F3లో పవన్ కళ్యాణ్..? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఏమిటి ఇది నిజంగా నిజమేనా ? స్వయంగా చిత్ర నిర్మాత దిల్ రాజు చెప్పాడు కాబట్టి, నమ్మక తప్పడం లేదు.

మరి, పవన్ ఈ సినిమాలో ఏ విధంగా కనిపిస్తాడో చూడాలి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ అప్పియరెన్స్ అని దిల్ రాజు అన్నాడు కాబట్టి.. అది ఎలా ఉంటుందో చూద్దాం. అలాగే, ఈ సినిమా ఫుల్ ఫన్ తో సాగే పక్కా ఫ్యామిలీ డ్రామా. పైగా ‘విక్టరీ వెంకటేష్ – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్’ కలిసి నటిస్తున్న చిత్రం. ఈ కలయికలో వచ్చిన ‘ఎఫ్ 2’ సూపర్ హిట్ అయ్యింది.
Also Read: Varun Tej: ఇంటర్వ్యూ : వరుణ్ తేజ్ – ఎఫ్ 3 నవ్వుల పండగలా వుంటుంది.
అన్నిటికి మించి దర్శకుడు అనిల్ రావిపూడికి, నిర్మాత దిల్ రాజుకు బాక్సాఫీస్ లెక్కలు బాగా తెలుసు. ఆ లెక్కలకు అనుకూలంగానే ‘ఎఫ్ 3’ స్క్రిప్ట్ లో అదిరిపోయే కామెడీతో పాటు పక్కా మాస్ మసాలా అంశాలు కూడా కథకు అనుగుణంగా పెట్టారు. అదే విధంగా ఎఫ్ 2లోని వెంకటేష్, వరుణ్ తేజ్‌ల కోబ్రా బంధం కంటిన్యూ అవుతుంది. ఈ సీక్వెల్ లోనూ తమన్నా, మెహ్రిన్ లు వీరికి భార్యలుగా నటిస్తున్నారు.
ఈ సినిమా పూర్తిగా డబ్బులు చుట్టూ నడిచే కామెడీ డ్రామా. అందుకే, దిల్ రాజు కూడా హీరోలకు అడిగినంత ఇచ్చేకుంటూ పోయాడు. ఎఫ్ 3 సినిమా బడ్జెట్ దాదాపుగా 48 కోట్ల వరకూ అయ్యింది. పైగా, ఈ సినిమాలో సునీల్, సోనాల్ లాంటి వాళ్ళను కూడా ఇరికించారు. అన్నిటికీ మించి పూజా హెగ్డేతో ఐటెమ్ సాంగ్ కూడా చేయించాడు. మొత్తమ్మీద ‘ఎఫ్ 3’ బడ్జెట్ లిమిట్ దాటేసింది. మరి రిటర్న్స్ పరిస్థితి ఏమిటి అనేదే ఇప్పుడు డౌట్.

‘ఆచార్య’ లాంటి భారీ సినిమాకే తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా 50 కోట్లు కలెక్షన్స్ రాలేదు. ‘ఎఫ్ 3’కి వస్తాయా ?. సినిమాలో అయితే, తమన్నా, మెహ్రీన్ ల రూపంలో ఫుల్ గ్లామర్ ను దట్టించారు. వెన్నెల కిషోర్, అలీ, రఘుబాబు రూపంలో ఫుల్ కామెడీని కూడా అద్దారు. కాబట్టి.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అవుతుందనే ఆశలు ఉన్నాయి. మరి ఆ ఆశలు అడియాసలు అవుతాయా ? కాసుల పంటగా మారతాయా ? అనేది రేపు తేలిపోనుంది.
Also Read:F3 Movie First Full Review: ఎఫ్ 3 మూవీ – హిట్టా ? ఫట్టా ?
Recommended Videos
[…] Also Read: Dil Raju: F3లో పవన్ కళ్యాణ్.. ఇదీ అసలు కిక్కంట… […]
[…] Also Read: Dil Raju: F3లో పవన్ కళ్యాణ్.. ఇదీ అసలు కిక్కంట… […]
[…] Also Read:Dil Raju: F3లో పవన్ కళ్యాణ్.. ఇదీ అసలు కిక్కంట… […]