Dil Raju- Karthikeya 2: సినిమా ఇండస్ట్రీలో బయటకు ఐక్యతగా ఉండాలని ఎన్ని కబుర్లు చెప్పినా .. లోపల ఎవరికీ వాళ్ళు రాజకీయాలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఆ నలుగురిలో ఒకరి సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. ఇక మిగిలిన ఏ సినిమాకి లైఫ్ ఉండదు. ఉదాహరణకు దిల్ రాజు తన ‘థాంక్యూ’ సినిమాను ఈ నెల 22న ప్లాన్ చేశాడు. ఇదే రోజు పోటీగా ‘కార్తికేయ 2’ కూడా రావాలి.
కానీ, థియేటర్స్ లేవు. ‘కార్తికేయ 2’ నిర్మాతలు రిలీజ్ కోసం చాలా తిప్పలు పడ్డారు. దిల్ రాజు బలం ముందు వీరి బలగం సరిపోలేదు. దాంతో కార్తికేయ 2 రిలీజ్ పోస్ట్ ఫోన్ అయ్యింది. దిల్ రాజే కావాలని ‘కార్తికేయ 2’ను పక్కకు తప్పించారని ఇండస్ట్రీలో విమర్శలు వినిపిస్తున్నాయి.
Also Read: The Warrior Collections: ‘ది వారియర్’ 9 డేస్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ పరిస్థితి ఇదే
ఈ పక్కకి తప్పించడాలు దిల్ రాజుకి కొత్తేమి కాదు. తన ఓన్ సినిమా కోసం ఆయన ఎవరి సినిమాకైనా థియేటర్స్ అందుబాటులో లేకుండా చేస్తారు. నిర్మాతగానే కాకుండా పంపిణీదారుడిగా కూడా దిల్ రాజుకి పూర్తి పట్టు ఉంది. పైగా ముఖ్యమైన థియేటర్స్ అన్నీ దిల్ రాజు చేతుల్లోనే ఉన్నాయి. ఇదే చిన్న సినిమాలకు పెద్ద సమస్య అయిపోయింది.
అయినా, తన సినిమా వస్తోంది కాబట్టి.. పోటీగా ఎవరి సినిమా రాకూడదు అని పట్టుబట్టడం సినిమా ఇండస్ట్రీకే మంచిది కాదు. ఉత్తరాంధ్ర, నైజాంలో తనకు ఎక్కువ థియేటర్లు ఉన్నాయని.. అడ్డు వచ్చిన సినిమాని తొక్కుకుంటూ వెళ్తే.. చిన్న నిర్మాతల భవితవ్యం ప్రశ్నార్థకం అవుతుంది.
మీడియా ముందు, స్టేజ్ ల మీద ఈ విషయాన్ని దిల్ రాజు, మిగిలిన బడా నిర్మాతలు ఎంత ఖండించినా తెరవెనుక వాస్తవం అయితే ఇదే. ‘కార్తికేయ 2’ సినిమాకి థియేటర్స్ లేకపోవడ వల్ల.. ఆగస్టు 12 కు రిలీజ్ డేట్ ను పోస్ట్ ఫోన్ చేసుకుంది. ఈ సినిమా పాన్ ఇండియా ఫిల్మ్ గా వస్తోంది. ఇప్పుడు దిల్ రాజు కారణంగా మిగిలిన భాషల్లో కూడా సినిమాని పోస్ట్ ఫోన్ చేయాల్సి వచ్చింది. అక్కడ ఆల్ రెడీ సినిమా ప్రమోషన్స్ కోసం బాగా ఖర్చు పెట్టారు. ఇప్పుడు అదంతా వృధా అయిపోయింది. మొత్తానికి ఈ సినిమాకి దిల్ రాజు విలన్ గా మారాడు. దిల్ రాజు ఇక నైనా చిన్న సినిమాల విషయంలో మోకాలు అడ్డుపెట్టకుండా ఉండాలని ఆశిద్దాం.