RRR Movie: చలనచిత్ర రంగంలో దర్శకులు ఎందరో ఉన్నారు. కానీ వారందరిలో ఎవరు ఎవర్ గ్రీన్ అంటే రాజమౌళి అని చెబుతారు.తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేసిన దర్శకధీరుడు రాజమౌళి. తన చిత్రాలలో ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనించి దానికి నేపథ్యం ఉండేలా చర్యలు తీసుకోవడం తెలిసిందే. స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు ఆయన చిత్రాలు అన్ని విజయవంతమయ్యాయి. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎంతో వైవిధ్యంగా ఉండేలా చూస్తారు. అందుకే ఆయన తెలుగుతోపాటు భారతీయ దర్శకుల్లోనే ప్రముముఖుడుగా పేరు తెచ్చుకోవడం విశేషం.

మల్టీస్టారర్ సినిమాలు తీసి కూడా హిట్ అనిపించుకోవడం ఆయనకే చెల్లింది. జూనియర్ ఎన్టీఆర్ ను కొమురం భీంగా రాంచరణ్ ను అల్లూరి సీతారామరాజుకు చూపిస్తూ ఆయన తీసిన ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీసు కలెక్షన్లు కొల్లగొట్టింది. సినిమా సినిమాకు ఆయన చూపిన వైవిధ్యం చూస్తుంటే అందరికి ఆశ్చర్యం కలుగుతోంది. బాహుబలి సినిమా ఖండాంతరాలకు పాకి తెలుగు సినిమా సత్తా చాటి తానేమిటో నిరూపించుకుంది. రెండు భాగాలు కూడా ఒకదాని మించి మరొకటి హిట్ సాధించి రాజమౌళి అంటే ఏమిటో చాటి చెప్పాయి. ఈ నేపథ్యంలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీలో ఓ సన్నివేశాన్ని అప్పటిదని నిరూపించడానికి ఎంతో శ్రమించారు.
Also Read: Rajya Sabha-Telangana: తెలంగాణ నుంచి రాజ్యసభ వెళ్లే వారెవరో?
సినిమాలో ఓ సన్నివేశంలో ఓ బాలుడు పడవపై ప్రమాదంలో ఉండగా ఎన్టీఆర్, రామరాజు ఆ కుర్రాడని రక్షిస్తారు. ఆ బాలుడు పట్టుకున్న జెండా విషయంలో రాజమౌళి ఎంతో శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. మన జాతీయ జెండా 1906 ఆగస్టు 7న ఆశిష్కరింిన జెండా మూడు రంగుల్లో పైన ాకుపచ్చ మధ్యలో పసుపు కింద ఎరుపు రంగు ఉంటుంది. దీన్ని రూపొందించి ఆ జెండా ఆకాంలోనిది అని చాటిచెప్పడానికి ఎంతో శ్రమించినట్లు తెలుస్తోంది.

ఈ జెండా ఒక ఏడాది మాత్రమే అమలులో ఉంది. 1907లో మరో జెండా వచ్చింది. దీంతో ఆ సన్నివేశం ఆ సంవత్సరంలో జరిగినది అని చాటి చెప్పేందుకే ఆయన పడిన తపన అర్థమవుతోంది. సినిమాల్లో ప్రతి సన్నివేశాన్ని తనదైన శైలిలో చిత్రీకరిస్తూ తన ప్రతిభ నిరూపించుకుంటున్నారు. అందుకే ాయన ఎవర్ గ్రీన్ దర్శకుడు అయినట్లు చెబుతున్నారు. మొత్తానికి ఆర్ఆర్ఆర్ సినిమాలో రాజమౌళి ప్రతి సన్నివేశం కోసం తన శక్తియుక్తులు అన్ని పెట్టి సినిమా విజయానికి బాటలు వేస్తారని తెలిసిందే.
Also Read:RRR Making Video: ‘ఆర్ఆర్ఆర్’లోని బ్రిడ్జి సీన్ అద్భుతహా.. ఎలా చేశారో చూడండి
Recommended Videos:
[…] […]
[…] […]
[…] […]