Heroine Soundarya Real Name: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొంతమంది మహానటులు మన మధ్య ఉన్నా లేకపోయినా వాళ్ళు పోషించిన అద్భుతమైన పాత్రల ద్వారా చిరస్థాయిగా మన మదిలో చెరగని ముద్ర వేస్తారు..అలంటి మహానటులలో కొంతమంది హీరోయిన్స్ కూడా కూడా ఉన్నారు..వారిలో ఒక్కరే సౌందర్య గారు..అలనాటి మహానటి సావిత్రి గారి తర్వాత నిన్నటి తరం హీరోయిన్స్ లో సౌందర్య గారు కూడా అంత గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించారు..దురదృష్టం కొద్దీ ఈరోజు ఆమె మన మధ్య లేకపోయినప్పటికీ ఆమె పోషించిన అద్భుతమైన పాత్రలు ద్వారా ఇప్పటికి మన మధ్య తిరుగుతూనే ఉన్నారు..చిరంజీవి, బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్, జగపతి బాబు మరియు శ్రీకాంత్ ఇలా ఎవరి పక్కన ఆమె హీరోయిన్ గా నటించిన మేడ్ ఫర్ ఈచ్ అథర్ అనే రేంజ్ జోడి గా అనిపించేలా చెయ్యడం సౌందర్య స్పెషల్..అందుకే మిగిలిన హీరోయిన్స్ లాగ పెద్దగా అందాలు ఆరబొయ్యకపోయిన కూడా సౌందర్య టాప్ హీరోయిన్ గా అన్ని సంవత్సరాలు ఇండస్ట్రీ ని ఏలింది.

సౌందర్య రాజేంద్ర ప్రసాద్ హీరో గా నటించిన రాజేంద్రుడు గజేంద్రుడు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది..తొలి సినిమానే భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో సౌందర్య కి హీరోయిన్ అవకాశాలు వెల్లువలా కురిసాయి..అయితే ఇండస్ట్రీ కి వచ్చే ముందు చాలా మంది హీరోలు మరియు హీరోయిన్లు తమ అసలు పేరు ని మార్చుకొని వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి..మెగాస్టార్ చిరంజీవి నుండి మోహన్ బాబు వరుకు చాలా మంది ఇలా పేర్లు మార్చుకొని వచ్చినవాళ్లే..అలా సౌందర్య కూడా సినిమాల కోసం తన పేరు ని మార్చుకోవాల్సి వచ్చింది..ఆమె అసలు పేరు సౌమ్య అట..కర్ణాటక ప్రాంతానికి చెందిన ఈ సౌమ్య ఇండస్ట్రీ కి వచ్చిన తర్వాత SV కృష్ణ రెడ్డి గారి సలహా మేరకు తన పేరు ని సౌందర్య గా మార్చుకుంది..ఇక ఆ తర్వాత ఆ పేరు తో ఆమె తెలుగు ప్రేక్షకుల మదిలో వేసిన ముద్ర ఎలాంటిదో మన అందరికి తెలిసిందే..తెలుగు , తమిళం , మలయాళం మరియు కన్నడ భాషలకు కలిపి సుమారు వందకి పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సౌందర్య చివరిసారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం మోహన్ బాబు హీరో గా నటించిన శివ శంకర్ అనే సినిమా..ఈ చిత్రం అప్పట్లో సౌందర్య గారు చనిపోయిన తర్వాత థియేటర్స్ లో విడుదలైంది.
[…] Also Read: Heroine Soundarya Real Name: సినిమాల్లోకి రాకముందు సౌం… […]