https://oktelugu.com/

Deepika Padukone: స్టార్ హీరోయిన్ దీపిక పడుకొనే పై చేతబడి చేయించి పట్టుబడిన ఆ క్రేజీ హీరోయిన్ తల్లి!

అలాంటి హీరోయిన్స్ లో ఒకరు దీపికా పడుకొనే.బాలీవుడ్ లో ఈమె రేంజ్ ఖాన్స్ కి ఏమాత్రం తీసిపోదు. షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన 'ఓం శాంతి ఓం' చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన దీపికా పడుకొనే తొలిసినిమాతోనే తన సత్తా చాటింది.

Written By:
  • Vicky
  • , Updated On : May 22, 2023 / 02:20 PM IST

    Deepika Padukone

    Follow us on

    Deepika Padukone: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో కొంతమంది హీరోయిన్స్ కి స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని స్టార్ స్టేటస్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. కేవలం వీళ్ళు ఉన్నారనే కారణం చేత థియేటర్స్ కి క్యూ కట్టే ఆడియన్స్ ఎంతో మంది ఉన్నారు. వీళ్ళ కోసం దర్శక నిర్మాతలు కోట్ల రూపాయిలు కుమ్మరిస్తుంటారు. వాళ్ళు ఏమి డిమాండ్ చేసిన కాదన్నారు. కోటి మందిలో ఒకరికి దక్కే అరుదైన అవకాశం ఇది.

    అలాంటి హీరోయిన్స్ లో ఒకరు దీపికా పడుకొనే.బాలీవుడ్ లో ఈమె రేంజ్ ఖాన్స్ కి ఏమాత్రం తీసిపోదు. షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన ‘ఓం శాంతి ఓం’ చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన దీపికా పడుకొనే తొలిసినిమాతోనే తన సత్తా చాటింది. ఆ సినిమాలో ఆమె తన అందం తో ఒక పక్క కుర్రకారులను ఉక్కిరి బిక్కిరి చేస్తూనే, మరోపక్క తన అద్భుతమైన నటనతో సినిమా లో అందరినీ లీనం అయ్యిపోయేలా చేసింది. ఈమె ప్రదన పాత్రలో నటించిన కొన్ని సినిమాలు 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినవి ఉన్నాయి.

    అయితే దీపికా పడుకొనే క్రేజ్ మరియు స్టార్ స్టేటస్ ని చూసి బాలీవుడ్ లో కొంతమంది స్టార్ హీరోయిన్స్ అసూయ పడేవారట. ఆమెకి కేవలం ఇండియా లో మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సందు లేటెస్ట్ గా దీపికా పడుకొనే అంటే అలియా భట్ కి ఎంత అసూయ ఉండేదో చెప్పుకొచ్చాడు. అలియా భట్ కి దీపికా పడుకొనే అంటే అసలు ఇష్టం ఉండేది కాదని, ఆమె అంటే అలియా కి మొదటి నుండే ఎంతో అసూయ అని చెప్పుకొచ్చింది. అంతేకాదు తన భర్త రణబీర్ కపూర్ దీపికా తో కలిసి నటించేందుకు ఆమె ఇష్టపడదట.

    అలియా తన తల్లితో కలిసి దీపికా పడుకొనే పై చాటబడి కూడా చేయించిందని చెప్తున్నాడు. ఇతను మొదటి నుండి పాపులారిటీ కోసం ఇలాంటి కారుకూతలు కూస్తూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే, ఇది కూడా అలాంటిదే అని అలియా భట్ అభిమానులు అంటున్నారు. ఇప్పటి వరకు ఆయన ఎంతోమంది సెలెబ్రిటీలపై ఇలాంటి పుకార్లు పుట్టించారు, అవి వాళ్ళ వ్యక్తిగత జీవితం పై కూడా ప్రభావం చూపాయి. ఇంత జరుగుతున్న ఇతని పై ఎలాంటి యాక్షన్ ఎవ్వరూ తీసుకోకపోవడం విశేషం.