https://oktelugu.com/

Raghavendra Rao: అప్పట్లో సైకిల్ సీన్లకు యమ క్రేజ్.. అందుకే సైకిల్ ను రాఘవేంద్రరావు బాగా వాడారా?

ప్రస్తుతం బైక్ లపై వెళ్తూ రొమాన్స్ సీన్స్ షూట్ చేస్తున్నారు. కానీ అప్పట్లో అలా కాదు హీరోయిన్ ను ముందు లేదా వెనక కూర్చొబెట్టుకొని సైకిల్ తొక్కేవారు. అలా సైకిల్ పై ఊసులాడుతూ, పాటలు పాడుతూ వెళుతుంటే వచ్చే ఆ మజానే వేరు.

Written By:
  • Neelambaram
  • , Updated On : November 20, 2023 / 11:51 AM IST
    Follow us on

    Raghavendra Rao: ఇప్పుడు కారుంటే రిచ్, కానీ అప్పట్లో సైకిల్ ఉంటే ఫుల్ రిచ్. కాలినడకన వెళ్లేవారు ప్రతి ఒక్కరు. ఇక ఎవరికో ఒకరికి మాత్రమే సైకిల్ ఉండేది. కానీ ఈ రోజుల్లో స్కూల్ కి వెళ్తున్న వారు మాత్రమే సైకిల్ పై వెళ్తున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర కనీసం స్కూటర్, టీవీఎస్ మోటర్ సైకిల్ అయినా ఉంటుంది. కానీ అప్పట్లో పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉండేది. ఎక్కడికి వెళ్లాలన్నా సైకిల్ పై మాత్రమే వెళ్లేవారు. థియేటర్ లోని పార్కింగ్ స్థలం అంతా సైకిల్స్ తో నిండిపోయేది. ఇప్పుడు ఆ ప్లేస్ ను మోటర్ సైకిల్స్, కార్లు ఆక్రమించాయి. అయితే డైలీ సైకిల్ తొక్కడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇదిలా ఉంటే సినిమాల్లో ఇప్పుడు స్కై డైవింగ్ చేస్తూ రొమాన్స్ చేస్తున్నారు. కానీ అప్పట్లో రొమాన్స్, సాంగ్స్ అన్నీ కూడా సైకిల్ పైనే ఉండేవి.

    ప్రస్తుతం బైక్ లపై వెళ్తూ రొమాన్స్ సీన్స్ షూట్ చేస్తున్నారు. కానీ అప్పట్లో అలా కాదు హీరోయిన్ ను ముందు లేదా వెనక కూర్చొబెట్టుకొని సైకిల్ తొక్కేవారు. అలా సైకిల్ పై ఊసులాడుతూ, పాటలు పాడుతూ వెళుతుంటే వచ్చే ఆ మజానే వేరు. చూసే వారికి కూడా ఈ దృశ్యం పులకరింపజేస్తుంది. తెలుగు సినీ దర్శకులు లవర్స్ సైకిల్ పై వెళ్లడం సూపర్ రొమాంటిక్ గా ఉంటుందని కనిపెట్టి వాటిని డ్యూయట్లలో పెట్టారు. అయితే ఇప్పుడు సైకిల్ జోలికిపోవడం చాలా తక్కువ. పెళ్లి కానుక సినిమాలో రొమాంటిక్ హీరో అక్కినేని నాగేశ్వరరావు, బ్యూటీ క్వీన్ బి. సరోజాదేవితో కలిసి సైకిల్ మీద డ్యూయట్ వేసుకోవడం అప్పట్లో చాలా మందిని ఆకట్టుకుంది.

    ఈ ట్రెండ్ ను దర్శకుడు రాఘవేంద్రరావు తన కెరీర్ ప్రారంభంలోనే మొదలు చేశాడు. ఆయన అన్ని సినిమాల్లో కూడా హీరోహీరోయిన్స్ చేత సైకిల్ తొక్కించేవాడు. మోసగాడు మూవీలో శ్రీదేవి, శోభన్ సైకిల్ పై ఒక డ్యూయట్ సాంగ్ చేశారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి నటించిన సినిమాల్లో సైకిల్ పాటలు ఒక ప్రత్యేకం అని చెప్పాలి. ఘరానా మొగుడు సినిమాలో చిరంజీవి ఆఫీస్ కు వెళ్లడానికి సైకిల్ కొంటాడు. ఆ సైకిల్ పై వాణీ విశ్వనాథ్ ఎక్కినప్పుడు డ్రీమ్ సాంగ్ షురు అవుతుంది. ఆ పాటలో సైకిల్ జోరుకు తోడు వర్షం కూడా పడుతుంది.

    అభిలాష సినిమాలో చిరు, రాధిక కలిసి సైకిల్ మీద పాట పాడుతారు. ఈ పాటలో చిరంజీవిలోని శక్తిని చూసి తెలుగు ప్రేక్షకులు ఆశ్యర్యపోతారు. ఆ పాటలో ఒక్క సైకిల్ కాదు, అప్పటి మార్కెట్ లో ఉన్న ప్రతి టూవీలర్ ను వాడారు. రాఘవేంద్రరావు తొలి సినిమా బాబు కమర్షియల్ గా విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన జ్యోతి సినిమా మాత్రం పెద్ద విజయం సాధించింది. ఆ సినిమాలో కూడా రాఘవేంద్రరావు తన అభిమానమైన సైకిల్ పాటను పెట్టారు. ఇందులో మురళీమోహన్, జయసుధ కలిసి సైకిల్ తొక్కుతారు. అయితే ఈ సైకిల్ పాటల అందాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది కొంగరజగ్గయ్య. 1958లో వచ్చిన ముందడుగు సినిమాలో జగ్గయ్య, షావుకారు జానకిల మీద చిత్రీకరించిన కోడెకారు చిన్నవాడా పాట వింటే ఎవరైనా మహదేవన్ తెలుగువాడు కాదంటే నమ్మలేరు. ఆ పాటలో ఆత్రేయ తన అద్భుతమైన కవిత్వాన్ని చూపించారు.