‘రాధేశ్యామ్’ మూవీని ప్రభాస్ పక్కనపెట్టాడా?

ప్రభాస్ అభిమానులు ‘రాధేశ్యామ్’ సినిమా కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో అభిమానులు ఈ చిత్రం గురించి కనీసం ఒక్క అప్డేట్ అయినా వస్తుందని ఆశిస్తున్నారు. కానీ నిర్మాత కానీ.. దర్శకుడు కానీ ఏ అప్డేట్ ఇవ్వకుండా నాన్చుతున్నారు. ఇక ప్రభాస్ కూడా రాధేశ్యామ్ సినిమాను పూర్తిగా వదిలేసి వేరే సినిమాలు చేసుకుంటున్నారు. దీంతో ‘రాధేశ్యామ్’ చిత్రం దుస్థితి ఏం కానుందని అభిమానులు కలత చెందుతున్నారు. ఈ సంవత్సరం ఈ సినిమా విడుదలవుతుందా? అని […]

Written By: NARESH, Updated On : July 13, 2021 12:04 pm
Follow us on

ప్రభాస్ అభిమానులు ‘రాధేశ్యామ్’ సినిమా కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో అభిమానులు ఈ చిత్రం గురించి కనీసం ఒక్క అప్డేట్ అయినా వస్తుందని ఆశిస్తున్నారు. కానీ నిర్మాత కానీ.. దర్శకుడు కానీ ఏ అప్డేట్ ఇవ్వకుండా నాన్చుతున్నారు.

ఇక ప్రభాస్ కూడా రాధేశ్యామ్ సినిమాను పూర్తిగా వదిలేసి వేరే సినిమాలు చేసుకుంటున్నారు. దీంతో ‘రాధేశ్యామ్’ చిత్రం దుస్థితి ఏం కానుందని అభిమానులు కలత చెందుతున్నారు. ఈ సంవత్సరం ఈ సినిమా విడుదలవుతుందా? అని సందేహంలో పడుతున్నారు.

టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. రాధేశ్యామ్ చిత్రీకరణ పెండింగ్ లో ఉంది. పూర్తిచేయడానికి ఇంకా 10 రోజులు అవసరం. ప్రభాస్ మరో 10 రోజులు ఈ సినిమా షూటింగ్ కోసం పాల్గొనాల్సి ఉంది. ప్రభాస్ కాల్షీట్లను బట్టి ఈనెల చివరి వారంలో లేదా ఆగస్టు చివరి వారంలో ఇది జరుగుతుంది. అప్పుడు సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇక ఈ చిత్రం కోసం చాలా వీఎఫ్ఎక్స్ పనిచేయాల్సి ఉంది. ఆ పనిలో 50శాతం మాత్రమే ఇప్పటివరకు పూర్తయ్యింది. మిగిలినవి పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందో ఎవరికీ తెలియదు.

పని కోణాన్ని పక్కనపెడితే .. విడుదలకు కూడా అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. చాలా సినిమాలు వరుసలో ఉండడంతో ‘రాధేశ్యామ్’ను ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది తేదీ నిర్ణయించాలి.

టాలీవుడ్ లో ఈజీనే కానీ.. బాలీవుడ్ లో సినిమా తేదీని అనౌన్స్ చేయడం చాలా కష్టం. అక్కడ అనేక నిబంధనలు అడ్డంకిగా ఉన్నాయి. ఇవన్నీ చూస్తే 2021 సంవత్సరంలో తెరపైకి ఈ సినిమా వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.