Tarun-Mahesh Babu: బండ్లు ఓడలవుతాయి ఓడలు బండ్లవుతాయి అంటే ఇదేనేమో. ఒకప్పుడు చిన్న హీరోలే నేటి స్టార్ హీరోలు. స్టార్ డమ్ లేనప్పుడు ఎంత మంచి సినిమా అయినా అది ఆడదు. ఆదే స్టార్ డమ్ ఉన్నప్పుడు చిన్న సినిమా కూడా పెద్ద సినిమాగా హిట్ అయి కూర్చుకుంటుంది. అదే స్టార్ ఇమేజ్. ఒకప్పుడు ప్రస్తుత ప్రిన్స్ మహేశ్ బాబు సినిమా కూడా ఇతరుల సినిమాలతో పోటీ పడక చతికిల పడిపోవడం తెలిసిందే. ఇలాంటి సంఘటనలు జరిగిన దాఖలాలు కూడా ఉండటం గమనార్హం. ప్రస్తుతం హీరో తరుణ్ ప్రస్థానమే ప్రశ్నార్థకంగా మారిన ఆయన మొదటి సినిమా మహేశ్ బాబు సినిమాను టార్గెట్ చేయడం ఆశ్చర్యకరమే.

2000 సంవత్సరం చివరిలో ఐదు సినిమాలు విడుదల అయ్యాయి. అందులో ఆజాద్, జయం మనదేరా, అమ్మో ఒకటో తారీఖు, నువ్వేకావాలి, వంశీ విడుదలయ్యాయి. ఇందులో ఆజాద్, జయం మనదేరా, నువ్వే కావాలి సినిమాలు బ్రహ్మాండమైన హిట్ అయ్యాయి. ఇక అమ్మో ఒకటే తారీఖు యావరేజ్ గా ఆడింది. కానీ మహేశ్ బాబు నటించిన వంశీ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. చిన్న సినిమా అయినా తరుణ్ నటించిన నువ్వే కావాలి పెద్ద సినిమాగా మారడం తెలిసిందే.

విజయభాస్కర్ దర్శకత్వంలో ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించిన చిత్రం నువ్వే కావాలి. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ విజయపరంపరలో దూసుకెళ్లింది. ఏకంగా రూ.25 కోట్లు రాబట్టి అందరిలో ఆశ్చర్యం కలిగించింది. కానీ వంశీ మాత్రం వాటిని తట్టుకోలేకపోయింది. మహేశ్ బాబుతో నటించిన నమ్రతా శిరోద్కర్ ఆయన భాగస్వామి కావడం తెలిసిందే.

Also Read: కొత్త ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తున్న సమంత.. ఆమె ఎవరంటే..?
కానీ ప్రస్తుతం మహేశ్ బాబు ఓ స్టార్ హీరో. ఆయనకున్న స్టార్ డమ్ తెలిసిందే. అప్పుడు చిన్న స్టార్ కావడంతోనే ఆయన సినిమా విజయవంతం కాలేకపోయింది. ఇప్పుడు హీరో తరుణ్ కనుమరుగైపోయిన సంగతి తెలిసిందే. అప్పుడు అంత ప్రభావం చూపిన తరణ్ సినిమా పరిశ్రమకు దూరం కావడం చూస్తున్నాం. ఇక అప్పుడు వచ్చిన ఆజాద్ సినిమా నాగార్జునకు మంచి హిట్ అందించింది.
అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమా పెద్ద హిట్ గా నిలిచింది. ఇక జయం మనదేరా కూడా బ్లాక్ బ్లస్టర్ గా నిలిచింది. నిర్మాత సురేష్ బాబు ఎన్ శంకర్ దర్శకత్వంలో నిర్మించిన జయం మనదేరా కూడా భారీ హిట్ గా నిలిచింది. కానీ బి.గోపాల్ దర్శకత్వంలో పద్మాలయా స్టూడియోస్ పతాకంపై మహేశ్ బాబు నటించిన వంశీ మాత్రం ఆకట్టుకోలేక వెనుకబడిపోవడం గమనార్హం.
Also Read: విష్ణు నో చెప్పి ఉంటే నేను ఓకే చెప్పవాడిని కాదు.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు..!
[…] […]
[…] Also Read: తరుణ్ సునామీలో కొట్టుకుపోయిన మహేష్ బ… […]
[…] Also Read: Tarun-Mahesh Babu: తరుణ్ సునామీలో కొట్టుకుపోయిన … […]