https://oktelugu.com/

Saindhav: సైంధవ్ సినిమాపై గుంటూరు కారం, హనుమాన్ సినిమాల ఎఫెక్ట్ పడిందా?

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు, కొత్త డైరెక్టర్లు వాళ్ళకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకోవాలని తాపత్రయపడుతుంటారు. అందులో భాగంగానే డిఫరెంట్ స్టోరీలతో వస్తుంటారు. ఇక ఈ సైంధవ్ డైరెక్టర్ శైలేష్ కొలను కూడా కొత్త డైరెక్టర్.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : January 13, 2024 / 05:29 PM IST

    Saindhav

    Follow us on

    Saindhav: ఫ్యామిలీ సినిమాలు తీయడంలో వెంకటేష్ తర్వాతనే ఎవరైనా అనే టాక్ తెచ్చుకున్నారు విక్టరీ వెంకటేష్. రీసెంట్ గా వచ్చిన రానా నాయుడు వెబ్ సిరీస్ మినహా ఈయన నటించిన అన్ని సినిమాలు కూడా ఫ్యామిలీ కంటెంట్ తో వచ్చిన సినిమాలే. అయితే ఈ సారి సంక్రాంతి బరిలో నిలిచారు వెంకీ మామ. ఈయన నటించిన సైంధవ్ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించింది. సినిమా కూడా బాగుందంటున్నారు నెటిజన్లు. ఈయన అభిమానులు మాత్రమే కాదు సినిమా చూసిన ప్రేక్షకుల నోటి నుంచి కూడా ఇదే టాక్ వస్తుంది. మరి కలెక్షన్లు ఎలా ఉన్నాయో తెలుసా?

    సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు, కొత్త డైరెక్టర్లు వాళ్ళకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకోవాలని తాపత్రయపడుతుంటారు. అందులో భాగంగానే డిఫరెంట్ స్టోరీలతో వస్తుంటారు. ఇక ఈ సైంధవ్ డైరెక్టర్ శైలేష్ కొలను కూడా కొత్త డైరెక్టర్. కానీ ఈయన ఇంతకంటే ముందే హిట్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ముందుగా విశ్వక్ సేన్ తో వచ్చిన హిట్ సినిమాతో హిట్ ను అందుకుంటే.. తర్వాత అడవి శేషును హీరోగా పెట్టి హిట్ 2ను తెరకెక్కించారు. ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ ను సొంతం చేసుకుంది.

    ఇక రెండు సినిమాలు కూడా సూపర్ సక్సెస్ ను సాధించగా సైంధవ్ ను తెరకెక్కించారు ఈ డైరెక్టర్. ఈ సినిమా కూడా మంచి ఫలితాలను అందుకుంది. కానీ హనుమాన్, గుంటూరు కారం సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకోగా కలెక్షన్ల పరంగా సైంధవ్ డీలా పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రెండు సినిమాలకు ఆల్రెడీ సక్సెస్ టాక్ వచ్చి మంచి కలెక్షన్లతో దూసుకొని పోతున్నాయి. కాబట్టి వెంకటేష్ సినిమా మీద ఎలాగైనా భారం పడుతుందనే టాక్ వస్తుంది. ఇక సైంధవ్ సినిమా ఈ రోజు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

    వెంకటేష్ సినిమా ఈ రోజు రిలీజ్ అయినా కలెక్షన్ల పరంగా వేటు తప్పదంటున్నారు ట్రేడ్ పండితులు. కానీ ఈ సినిమాలో వెంకటేష్ తన నట విశ్వరూపం చూపించారు అంటున్నారు ఈ సినిమా చూసిన నెటిజన్లు. కానీ ఈ సినిమాను చూడడానికి ఫ్యామిలీతో సహా చాలా మంది థియేటర్లకు వెళ్తున్నారు. మరి కలెక్షన్లు ముగిసే సరికంటే లాభాలను సంపాదిస్తుందో లేదో చూడాలి.