Chiranjeevi Advice To Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రేక్షకులందరు వాళ్ల సినిమాలనే ఎక్కువగా చూడడానికి ఇష్టపడుతుంటారు. స్క్రీన్ మీద విజువల్ వండర్స్ ని చూపించే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి వాళ్ళ సినిమాలకి ఉన్న ఆదరణ మిగతా హీరోలకు దక్కదు. ఇక ముఖ్యంగా బీ,సీ సెంటర్లలో ఉన్న ఆడియన్స్ అయితే స్టార్ హీరోల సినిమాలను రిపీటెడ్ గా చూడడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక రామ్ చరణ్ సైతం ప్రస్తుతం మాస్ కమర్షియల్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.
వాళ్ల నుంచి వచ్చిన ప్రతి సినిమా విషయంలో ఆయన చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. గత సంవత్సరం చేసిన ‘గేమ్ చేంజర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కూడా ఆ మూవీ పెద్దగా సక్సెస్ ను సాధించలేదు. పెద్ది సినిమా విషయంలోనే ఆయన కొంతవరకు తడబడ్డాడు. మొత్తానికైతే పెద్ది సినిమా రిజల్ట్ చూసిన తర్వాత చిరంజీవి రామ్ చరణ్ కి క్లాస్ పీకినట్టుగా తెలుస్తుంది.
కథల విషయంలో చాలా క్లారిటీగా ఉండాలని దర్శకుడు ఏది చెప్తే అది నమ్మొద్దని వాళ్ళు చెప్పిన కథను చెప్పినట్టుగా స్క్రీన్ మీద చిత్రీకరిస్తున్నారా? లేదా అనేది ఒకటికి పది సార్లు చెక్ చేసుకోవాలని రామ్ చరణ్ కి చెప్పారట. మొత్తానికైతే చిరంజీవి తన అనుభవం దృష్ట్యా చెప్పిన మాటలను రామ్ చరణ్ స్వీకరించినట్టుగా తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో దర్శకులు హీరోలను ఒప్పించడానికి వాళ్ల క్యారెక్టర్లు హైలెట్ అవుతుందని చెప్పి మరి సినిమాను ఓకే చేయిస్తారు. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన సీన్స్ కి తీసే సీన్స్ కి అసలు సంబంధం ఉండదు. గేమ్ చేంజర్ విషయంలో అదే జరిగిందని చిరంజీవి రామ్ చరణ్ ని మందలించారట.
ఇక పెద్ది సినిమా విషయంలో బుచ్చిబాబు చెప్పింది చెప్పినట్టుగా తీసినప్పటికి సినిమాలో ఏదో అసంతృప్తి అయితే ఉందని అది ప్రేక్షకులకు అంత పెద్దగా కనెక్ట్ కావడం లేదని చిరంజీవి రామ్ చరణ్ తో కూడా డిస్కస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంత వరకు సక్సెస్ ని సాధిస్తుంది. ఎంతటి బజ్ ను రాబడుతుంది అనేది తెలియాల్సి ఉంది…
