Dhurandhar: బాక్స్ ఆఫీస్ వద్ద ‘ధురంధర్'(Dhurandhar Movie) సృష్టించిన ప్రభంజనం గురించి ప్రేక్షకులు అంత తేలికగా ఎప్పటికీ మర్చిపోలేరు. విడుదలకు ముందే ఈ చిత్రం ఎంతో నెగిటివిటీ ని తెచ్చుకుంది. బీజేపీ అజెండా చిత్రమంటూ తెగ రుద్దారు దురాభిమానులు. కానీ విడుదల తర్వాత అలా కామెంట్ చేసిన వారి చేత కూడా సెల్యూట్ చేయించింది ఈ చిత్రం. నాలుగు రోజుల క్రితమే ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఓటీటీ లో విడుదలైనప్పుడు కచ్చితంగా ఈ చిత్రం సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా అందరి అంచనాలను మించి మరీ నెట్ ఫ్లిక్స్ లో ప్రభంజనం సృష్టించింది. హిందీ తో పాటు తెలుగు, తమిళ్, కన్నడ మరియు మలయాళం భాషలకు చెందిన వాళ్ళు కూడా ఈ చిత్రాన్ని ఎగబడి చూశారు. ఫలితంగా ఇండియా లోనే మొదటి మూడు రోజుల్లో అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకున్న చిత్రంగా నిలిచి #RRR రికార్డు ని బద్దలు కొట్టింది.
నెట్ ఫ్లిక్స్ అందించిన గణాంకాల ప్రకారం ఈ చిత్రం మొదటి మూడు రోజుల్లో 76 లక్షలకు పైగా వ్యూస్ ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా మొదటి స్థానం లో 7 దేశాల్లో ట్రెండ్ అవుతుండగా, 22 దేశాల్లో టాప్ 10 లో కొనసాగుతుంది ఈ చిత్రం. భవిష్యత్తులో ఈ రికార్డు ని అందుకోవడం కూడా కష్టమే. మొదటి మూడు రోజుల్లో అత్యధిక వ్యూస్ ని రాబట్టిన సినిమాల లిస్ట్ ఒకసారి చూస్తే, ధురంధర్ మొదటి స్థానం లో ఉండగా, సందీప్ వంగ తెరకెక్కించిన ‘యానిమల్’ చిత్రం 62 లక్షల వ్యూస్ తో రెండవ స్థానం లో కొనసాగుతుంది. ఇక తర్వాత హృతిక్ రోషన్ ఫైటర్ చిత్రం 59 లక్షల వ్యూస్ తో మూడవ స్థానం లో కొనసాగుతుండగా, ‘పుష్ప 2’ చిత్రం 58 లక్షల వ్యూస్ తో నాల్గవ స్థానం లో కొనసాగుతుంది.
అదే విధంగా అజయ్ దేవగన్ హీరో గా నటించిన ‘రైడ్ 2’ చిత్రం 56 లక్షల వ్యూస్ తో ఆరవ స్థానం లో కొనసాగుతుండగా, ‘క్రూ’ చిత్రం ఆరవ స్థానం లో కొనసాగుతుంది. ఇక ‘ధురంధర్’ విషయానికి వస్తే, ఇదే ఊపు లో ఈ చిత్రం రాబోయే రోజుల్లో కూడా కొనసాగితే, కచ్చితంగా ఈ సినిమా #RRR ఫుల్ రన్ రికార్డు ని బద్దలు కొడుతుందని అంటున్నారు విశ్లేషకులు. #RRR చిత్రానికి ఫుల్ రన్ లో 4 కోట్ల 30 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ రికార్డు ని ‘ధురంధర్’ చిత్రం 50 రోజులు కూడా గడవకముందే బద్దలు కొట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.