Dhurandhar: గత ఏడాది డిసెంబర్ 4 న విడుదలైన రణవీర్ సింగ్(Ranveer Singh) ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టించిన వసూళ్ల సునామీ ఎలాంటిదో చరిత్ర ఎప్పటికీ మర్చిపోలేదు. ఆదిత్య డర్ ఈ చిత్రానికి దర్శకుడిగా , రచయితగా, నిర్మాతగా వ్యవహరించాడు. ఆయన దర్శకత్వ ప్రతిభకు మామూలు ఆడియన్స్ మాత్రమే కాదు, సందీప్ వంగ, రామ్ గోపాల్ వర్మ వంటి సెలబ్రిటీలు కూడా సంబ్రమాశ్చర్యానికి గురై ట్వీట్లు వేశారు. నిన్న అర్థ రాత్రి నుండి ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లోకి అన్ని ప్రాంతీయ బాషల ఆడియో తో వచ్చేసింది. థియేటర్స్ లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో, నెట్ ఫ్లిక్స్ లో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాని చూసినప్పుడు ప్రతీ ఒక్కరు ‘ధురంధర్’ అద్భుతమైన సినిమా రా అంటూ కామెంట్స్ చేశారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ఓటీటీ వెర్షన్ పై అభిమానుల నుండి చిన్న కంప్లైంట్ ఉంది.
అదేమిటంటే ఈ సినిమా నిడివి దాదాపుగా 3 గంటల 34 నిమిషాల వరకు ఉంటుంది. కానీ నెట్ ఫ్లిక్స్ లో మాత్రం 3 గంటల 25 నిమిషాల నిడివి మాత్రమే ఉంది. అంటే 10 నిమిషాల ఫుటేజ్ ని తొలగించారు. అసలేమీ ఫుటేజీ తొలగించారంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ పెద్ద గోల చేస్తున్నారు. ఈ చిత్రం లో ఒక్క నిమిషం కూడా వృధా కాదు, ప్రతీ ఫ్రేమ్ ఎంతో ముఖ్యమైనది, సినిమాని పరుగులు తీయించే విధంగా ఉంటుంది. అలాంటిది 10 నిమిషాల ఫుటేజీ ని తొలగించడం చిన్న విషయం కాదు, అసలు ఏమి తొలగించారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ గగ్గోలు పెడుతున్నారు. సాధారణంగా ఓటీటీ లో డిలీట్ చేసిన సన్నివేశాలను అభిమానుల కోసం జత చేసి విడుదల చేసేవారు గతం లో. అలాంటిది ఇక్కడ ఉన్న సినిమాని కాస్త తగ్గించారు.
మరోవైపు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ జైత్ర యాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రానికి ఇప్పట్టి వరకు 895 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. మరో 5 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబడితే మొట్టమొదటి 900 కోట్ల నెట్ సినిమాగా ప్రచారం అవుతుంది ఈ చిత్రం. ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం 300 కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంది. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 1380 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కేవలం హిందీ వెర్షన్ తో ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు ఇప్పటి వరకు హిస్టరీ లో ఏ సినిమాకు కూడా రాలేదు.