Dhurandhar: మన తెలుగు రాష్ట్రాల్లో హిందీ సినిమాలు నెలల తరబడి ఆడడం వంటి అరుదైన సంఘటనలు అమితాబ్ బచ్చన్ కాలం లో చూశాము. తెలుగు లో డబ్ అవ్వడం వంటివి ఏమి లేవు , హిందీ లోనే అమితాబ్ బచ్చన్ సినిమాలు ఇక్కడ దుమ్ము లేపేవి. కానీ ఈమధ్య కాలం లో హిందీ వెర్షన్ లోనే విడుదలై, మన తెలుగు రాష్ట్రాల్లో భారీ రేంజ్ వసూళ్లను రాబట్టిన సినిమా ఏదైనా ఉందా అంటే అది ధురంధర్(Dhurandhar Movie) చిత్రం మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా 1300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, ఇప్పటికీ థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణ లో ఈ చిత్రం రెండు వారాల క్రితం విడుదలైన ప్రభాస్ ‘రాజా సాబ్’ కంటే ఎక్కువ షోస్ తో రన్ అవుతుంది అనే విషయం మీకు తెలుసా?.
చరిత్రలో గడిచిన రెండు దశాబ్దాలలో హైదరాబాద్ నగరంలో ఇంతటి లాంగ్ రన్ ని సొంతం చేసుకున్న చిత్రం మరొకటి లేదు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే, ఈ చిత్రానికి కేవలం తెలుగు రాష్ట్రాల నుండి 72 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. తెలుగు డబ్బింగ్ లేకుండా, హిందీ వెర్షన్ నుండి హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, వైజాగ్, విజయవాడ, విశాఖ, కర్నూల్, నెల్లూరు ఇలాంటి సిటీస్ నుండి ఈ చిత్రానికి ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు వచ్చాయట. దీన్ని బట్టీ తెలుగు లో ఈ చిత్రాన్ని విడుదల చేసుంటే ఏ రేంజ్ విద్వంసం చేసుండేదో మీరే ఊహించుకోండి. అందుకే ఈ సినిమా సీక్వెల్ ని అన్ని భాషలోనూ విడుదల చేయబోతున్నారు. మార్చి 19 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేయబోతున్నారు.
ఇకపోతే ఈ నెల 30 న ‘ధురంధర్’ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులకి రానుంది. హిందీ తో పాటు, తెలుగు, తమిళం మరియు ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. తెలుగు వెర్షన్ ఓటీటీ లో వచ్చిన తర్వాత మన యూత్ ఆడియన్స్ ఎగబడి చూస్తారు. KGF చాప్టర్ 2 కి అంతటి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి కారణం, అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఆ చిత్రాన్ని అందరూ ఎగబడి చూడడం వల్లే. మళ్లీ అలాంటి పరిస్థితి ‘ధురంధర్ 2’ కి రాబోతుంది.