Dhurandhar 4 Week Collections: లేటెస్ట్ బాలీవుడ్ సెన్సేషన్ ‘ధురంధర్'(Dhurandhar Movie) మూవీ బాక్స్ ఆఫీస్ వేట ఇంకా ఆగలేదు. రోజురోజుకు సరికొత్త బెంచ్ మార్క్స్ ని క్రియేట్ చేస్తూ , ఈ సినిమాకు వస్తున్న వసూళ్లను చూసి, ట్రేడ్ పండితులు సైతం నోరెళ్లెబెడుతున్నారు. భవిష్యత్తులో ఈ రికార్డ్స్ ని కొట్టడం మరో సినిమాకు అసాధ్యమే, దీన్ని కొట్టాలంటే ‘ధురంధర్ 2’ వల్లే అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. విడుదలై నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నాల్గవ వారం కూడా ప్రతీ రోజు డబుల్ డిజిట్ నెట్ వసూళ్లను రాబడుతూ సెన్సేషన్ సృష్టించింది. నేడు కూడా ఈ చిత్రానికి బుక్ మై షో లో ఈ చిత్రానికి గంటకు 8 వేల టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమాకు ఎలాంటి ట్రెండ్ కొనసాగుతుంది అని చెప్పడానికి. నాల్గవ వారం రోజులు వారీగా ఈ చిత్రానికి ఎంత నెట్ వసూళ్లు వచ్చాయో చూద్దాం.
శుక్రవారం రోజున 16 కోట్ల 70 లక్షల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, శనివారం రోజున 20 కోట్ల 90 లక్షలు, ఆదివారం రోజున 24 కోట్ల 30 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా సోమవారం రోజున 11 కోట్ల 20 లక్షల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు,మంగళవారం రోజున 12 కోట్ల 60 లక్షలు , బుధవారం రోజున 12 కోట్ల 40 లక్షలు, గురువారం రోజున 17 కోట్ల 60 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. అంటే ఓవరాల్ గా ఈ చిత్రానికి ఇప్పటి వరకు 784 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు కేవలం ఇండియన్ బాక్స్ ఆఫీస్ నుండి వచ్చాయి. వారాల వారీగా చూస్తే, మొదటి వారం 218 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి రెండవ వారం 261 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి.
అదే విధంగా మూడవ వారం లో 189 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు , నాల్గవ వారం లో 115 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. నాల్గవ వారం ఒక బాలీవుడ్ సినిమాకు వంద కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు రావడం చరిత్ర లో ఇదే తొలిసారి. ‘పుష్ప 2’ చిత్రానికి నాల్గవ వారం 58 కోట్ల రూపాయిలు రాగా, చావా చిత్రానికి 44 కోట్లు, స్త్రీ 2 చిత్రానికి 37.75 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఇక ఈ వీకెండ్ కూడా ఈ చిత్రానికి ఎదో ఒకరోజున 20 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చేలా ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అంటే ఐదవ వారం లో కూడా ఈ సినిమా 100 కోట్లకు పైగా నెట్ వసూళ్లను రాబట్టబోతుంది అన్నమాట.