Dhurandhar 2 teaser release date: గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన రణవీర్ సింగ్(Ranveer Singh) ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రకంపనలను మూవీ లవర్స్ అంత తేలికగా మర్చిపోలేరు. విడుదలై 7 వారాలు పూర్తి అయ్యింది. ఇప్పటికీ థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తోంది. 7వ వీకెండ్ లో కొత్త సినిమాలను తట్టుకొని ఈ చిత్రం ఏకంగా 10 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి 880 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో 900 కోట్ల నెట్ మార్కుని అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఆ రేంజ్ కి వెళ్తుందో లేదో చూడాలి. ఇంకా ఈ చిత్రం ఓటీటీ లో కూడా విడుదల కాలేదు, కానీ అప్పుడే ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ టీజర్ అప్డేట్ వచ్చేసింది.
విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం చూస్తుంటే రీసెంట్ గానే మేకర్స్ ‘ధురంధర్ 2′(Dhurandhar 2 Movie) టీజర్ ని రెడీ చేశారు అట. జనవరి 19 న, అనగా నిన్న ఈ టీజర్ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేశారట. సెన్సార్ సభ్యులు ఈ టీజర్ కి A రేటింగ్ ఇచ్చారు. ఈ టీజర్ లెంగ్త్ 1 నిమిషం 48 సెకండ్స్ ఉంటాయట. దీనిని జనవరి 23 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ టీజర్ ని థియేటర్స్ లో కూడా ఇక నాన్ స్టాప్ గా ప్లే చేస్తారట. అందుకే సెన్సార్ కూడా చేయించినట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని మార్చ్ 19 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇన్ని రోజులు ఈ సినిమా చెప్పిన తేదికి వస్తుందా లేదా అనే సందేహాలు అభిమానుల్లో ఉండేవి. కానీ ఈ టీజర్ తో ఆ సందేహాలకు తెరపడనుంది.
ఇకపోతే రెండవ భాగం హిందీ తో పాటు తెలుగు, తమిళ్ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. మొదటి భాగాన్ని తెలుగు లో విడుదల చేయనందుకు ఇక్కడి ప్రేక్షకులు చాలా అసంతృప్తి ని వ్యక్తం చేశారు. ఈ సినిమా తెలుగు లో లేకపోయినా హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్, కర్నూల్, నెల్లూరు ఇలా అన్ని ప్రధాన నగరాల్లో మన తెలుగు ఆడియన్స్ నుండి హిందీ వెర్షన్ కి విశేష ఆదరణ దక్కింది. హైదరాబాద్ లో అయితే ఈ చిత్రం ఇప్పటికీ గణనీయమైన షోస్ తో ప్రదర్శితమవుతోంది. హిందీ వెర్షన్ కే మనోళ్లు ఈ రేంజ్ రెస్పాన్స్ ఇచ్చారంటే, ఇక తెలుగు వెర్షన్ కి ఎలాంటి బ్రహ్మరధం పడుతారో మీరే ఊహించుకోండి.
Big News #Dhurandhar2 The Revenge Teaser certified ‘A’ by CBFC on 19th January 2026.
Length: 1 min 48 sec pic.twitter.com/rl9mRXwK5x
— Nishit Shaw (@NishitShawHere) January 19, 2026
