Dhurandhar 2 Gross: మూడు వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ‘ధురంధర్ 2′(Dhurandhar 2 Movie) చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1700 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కు కి దగ్గరగా వచ్చింది. అయితే మన దేశం లో సౌత్ , నార్త్ , ఈస్ట్ , వెస్ట్ రాష్ట్రాల నుండి ఎంత వసూళ్లు వచ్చాయి అనేది వివరంగా చాలా మందికి తెలియదు. ఇప్పుడు మేము ఆ వివరాలను క్లుప్తంగా ఈ స్టోరీ లో ఇవ్వబోతున్నాము. ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ , పంజాబ్ , హర్యానా , ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు అప్పర్ నార్త్ ఇండియన్ టెర్రిటరీస్ గా పిలుస్తారు. వీటిల్లో ఢిల్లీ నుండి ఈ చిత్రానికి 181 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఉత్తర్ ప్రదేశ్ నుండి 77 కోట్ల రూపాయిలు, పంజాబ్ నుండి 42 కోట్ల రూపాయిలు, హర్యానా నుండి 15 కోట్ల 40 లక్షల రూపాయిలు, ఉత్తరాఖండ్ నుండి 12 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
వీటితో పాటు ఇతర అప్పర్ నార్త్ ఇండియన్ టెర్రిటరీస్ నుండి ఈ చిత్రం అదనంగా 6 కోట్ల 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ఈ టెర్రిటరీ నుండి 334 కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. ఇక సెంట్రల్ వెస్ట్రన్ టెర్రిటరీస్ నుండి ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందో చూద్దాం. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర , గోవా వంటి రాష్ట్రాలు ఈ సెంట్రల్ వెస్ట్రన్ టెర్రిటరీస్ క్రిందకు వస్తాయి. ఈ రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి దాదాపుగా 459 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రాజస్థాన్ నుండి 57 కోట్ల 24 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, గుజరాత్ నమ్మేది 119 కోట్లు, మహారాష్ట్ర నుండి 277 కోట్ల 46 లక్షలు, గోవా నుండి 5 కోట్ల 33 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఇక సెంట్రల్ ఇండియన్ టెర్రిటరీస్ గురించి చూద్దాం. మధ్య ప్రదేశ్ , ఛతీస్ గర్ వంటి రాష్ట్రాలు దీని క్రిందకు వస్తాయి. మధ్య ప్రదేశ్ నుండి మూడు వారాల్లో 45 కోట్ల 44 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టగా, ఛతీస్ గర్ నుండి 16 కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ వాసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా 62 కోట్ల 14 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా యూనియన్ టెర్రిటరీస్ నుండి ఈ చిత్రానికి 2 కోట్ల 53 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మన సౌత్ ఇండియా లోని ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ , కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి ప్రాంతాల నుండి 275 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుండి 116 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఓవరాల్ గా మూడు వారాలకు కలిపి ఇండియా నుండి 1250 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అదే విధంగా వర్సెస్ నుండి 407 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టగా, ప్రపంచవ్యాప్తంగా 1656 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.