Dhanush Sir Movie: ధనుష్ ప్రస్తుతం రెండు డైరెక్ట్ తెలుగు సినిమాలు చేయబోతున్న సంగతి తెలిసిందే. అందులో ఒక సినిమా ‘శేఖర్ కమ్ముల’ది. రెండో సినిమా ‘వెంకీ అట్లూరి’ది. అయితే, ‘వెంకీ అట్లూరి’ – ధనుష్ సినిమా ‘సార్’ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 2 న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ఈ రోజు ఉదయం ప్రకటించారు. దీనికి సంభందించి ఓ ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేశారు.

పోస్టర్ లో.. ధనుష్ క్లాస్ రూం లో స్టూడెంట్స్ ముందు టేబుల్ మీద కూర్చొని బ్లాక్ బోర్డు మీద గణితం సబ్జెక్ట్ కు సంభందించిన అంశాలను చూపిస్తూ కనిపించాడు. ఈ పోస్టర్ బాగా ఆకట్టుకుంటోంది. విద్యావ్యవస్థ తీరు తెన్నుల మీదుగా కథానాయకుడు సాగించే ప్రయాణం అందులోని సమస్యలు, సంఘటనలు ‘సార్’ జీవితాన్ని ఏ తీరానికి చేర్చాయన్నది అటు ఆసక్తి ని, ఇటు ఉద్విగ్నత కు గురి చేస్తుంది.
అన్నట్టు తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా ‘సార్’ డిసెంబర్ 2 న విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలో పలు చిత్రాల నిర్మాణంతో దూసుకుపోతున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒక అడుగు ముందుకేసి శ్రీమతి సాయి సౌజన్య తో కలసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర నిర్మాణ సంస్థ ‘సార్’ కు సమర్పకునిగా వ్యవహరిస్తోంది. ‘సార్’ ధనుష్ తో సంయుక్త మీనన్ జోడీ కడుతున్నారు.

వెంకీ అట్లూరి దర్శకత్వం లో రాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిజానికి హీరో ధనుష్ డేట్స్ కోసం తమిళ నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ధనుష్ ఏరి కోరి తెలుగు నిర్మాతలతో ద్విభాషా చిత్రాలు చేస్తున్నాడు. అందుకే తమిళ నిర్మాతలు ఈ విషయంలో ధనుష్ పై సీరియస్ గా ఉన్నారు. ఇంతకీ ధనుష్ తమిళ నిర్మాతలు కంటే.. తెలుగు దర్శనిర్మాతలతో సినిమాలు చేయడానికి కారణం.. భారీ పారితోషికమే.
తమిళంలో ధనుష్ కి ఎలాగూ మార్కెట్ ఉంది. అదే తెలుగు దర్శనిర్మాతలతో సినిమా చేస్తే.. తెలుగులో కూడా సినిమాకి ఫుల్ మార్కెట్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొందరు నిర్మాతలు ధనుష్ కి రెట్టింపు పారితోషికం ఆఫర్ చేశారు. ఆ పారితోషికం కారణంగానే ధనుష్ సినిమాల ఎంపిక మారింది. కానీ తమిళ నెటిజన్లు మాత్రం ఈ విషయంలో ధనుష్ పై విరుచుకు పడుతున్నారు. ధనుష్ మాత్రం సైలెంట్ గా తన సినిమాలు తాను చేసుకుంటూ పోతున్నాడు.
Recommended videos:
https://www.youtube.com/watch?v=OJFhMeigwvw&a
[…] Also Read: Dhanush Sir Movie: ‘సార్’ రాక అప్పుడే.. మరోవైపు ధన… […]