Dhanush brutally insulted Pooja Hegde: పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు పూజా హెగ్డే(Pooja Hegde). తెలుగు,తమిళం,హిందీ ఇలా అన్ని ప్రధానమైన సినీ ఇండస్ట్రీస్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. కానీ ఈమధ్య కాలం లో పూజా హెగ్డే కి సక్సెస్ అనేదే కరువు అయ్యింది పాపం. అందం గా ఉండడం వల్ల అవకాశాలు అయితే వరుసగా వస్తున్నాయి కానీ, సినిమాలు మాత్రం ఫ్లాప్ అవుతున్నాయి. 2021 వ సంవత్సరం లో విడుదలైన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే సినిమానే పూజా హెగ్డే చివరి సూపర్ హిట్. ఆ తర్వాత విడుదలైన రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కా జాన్, దేవా చిత్రాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి.
Also Read: దిల్ రాజు తో కయ్యానికి సిద్దమైన నిర్మాత నాగవంశీ..తారా స్థాయికి చేరిన ఈగో క్లాష్!
ఇక రీసెంట్ గా విడుదలైన ‘రెట్రో’ కూడా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా కోసం పూజ హెగ్డే డీ గ్లామర్ అవతారం లో కనిపించింది. ప్రొమోషన్స్ కోసం చాలా కష్టపడింది. ఒక విధంగా ఆ సినిమాకు హైప్ ని తీసుకొని రావడం లో పూజా హెగ్డే సక్సెస్ అయ్యింది. కానీ ఈ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఒక ఆర్టిస్ట్ కి సినిమాల్లో అవకాశాలు రాకపోయినా పర్వాలేదు కానీ, ఒక సినిమాకి డేట్స్ అడిగి తీసుకొని, ఆ తర్వాత ఎదో కారణాలు చెప్పి సినిమా నుండి తీసి వేయడం చాలా అన్యాయమైన చర్య. రీసెంట్ గా పూజా హెగ్డే విషయం లో అలాంటిది జరిగింది. వివరాల్లోకి వెళ్తే డైరెక్టర్ విగ్నేష్ రాజా దర్శకత్వం లో తమిళ హీరో ధనుష్(Dhanush K Raja) ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రం లో హీరోయిన్ పాత్ర కోసం పూజా హెగ్డే ని ఎంచుకున్నారు.
Also Read: రంగస్థలం నేనే చేయాల్సింది, డైరెక్టర్ తో నా సీన్స్ తీసేయమన్నాను… మొగలి రేకులు సాగర్ షాకింగ్ కామెంట్స్
అడిగిన వెంటనే ఆమె కావాల్సినన్ని డేట్స్ ని కేటాయించింది. కానీ ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ, ఆమెని ఈ సినిమా నుండి తప్పించి మమిత బైజు(Mamitha Baiju) ని ఎంచుకున్నారట. ఈ విషయం కూడా పూజా హెగ్డే కి చెప్పకుండా చేశారట. దీనికి ఆమె మనసు చాలా నొచ్చుకుంది కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. పూజా హెగ్డే కి వరుసగా ఫ్లాప్స్ వస్తుండొచ్చు కానీ , ఆమె చాలా బిజీ హీరోయిన్ అనేది వాస్తవం. ప్రస్తుతం ఆమె చేతిలో కూలీ, జన నాయగన్,హే జవానీ తో ఇష్క్ హోనా హై, కాంచన 4 లతో పాటు ఒక తెలుగు సినిమా కూడా ఉంది. ఇన్ని సినిమాల మధ్య అడిగిన వెంటనే డేట్స్ సర్దుబాటు చేసి ఇవ్వడం చాలా కష్టమైన పని. అయినప్పటికీ డేట్స్ సర్ది ఇచ్చినందుకు ఆమెకు ఇంతటి అవమానం జరిగింది. దీనిని పూజా హెగ్డే అభిమానులు అసలు తీసుకోలేకపోతున్నారు.