Dhanush And Mrunal Thakur: చాలా కాలం నుండి సోషల్ మీడియా లో ప్రముఖ యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur), ధనుష్(Dhanush K Raja) లు ప్రేమించుకుంటున్నారని, వీళ్లిద్దరు ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ధనుష్ నుండి ఎలాంటి రియాక్షన్ రాలేదు కానీ, మృణాల్ ఠాకూర్ మాత్రం మేము కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పుకొచ్చింది. దీంతో కొంతకాలం ఈ రూమర్స్ కి తెరపడింది. కానీ మృణాల్ ఠాకూర్ ని ధనుష్ తరుచు కలుస్తుండడం , ఆమె ప్రతీ సినిమాకు సంబంధించిన అప్డేట్ కి ఇన్ స్టాగ్రామ్ లో ధనుష్ కామెంట్స్ చేస్తుండడం వంటివి చూసిన తర్వాత, వీళ్లిద్దరు రిలేషన్ లో లేదంటే నమ్మశక్యంగా లేదే అని నెటిజెన్స్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ లో కియారా అద్వానీ , సిద్దార్థ్ మల్హోత్రా జంట కూడా ఇలాగే మా మధ్య ఏమి లేదంటూ చెప్పుకొచ్చి, ఒకరోజు అకస్మాత్తుగా పెళ్లి చేసుకొని అందరినీ సర్ప్రైజ్ కి గురి చేశారు.
అదే విధంగా మన టాలీవుడ్ లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లు కూడా పెళ్లి కి ముందు ఇలాగే చెప్పేవారు. విజయ్ దేవరకొండా, రష్మిక జంట కూడా ఈ క్యాటగిరీ కి సంబంధించిన వారే. మృణాల్ ఠాకూర్, ధనుష్ జంట కూడా రాబోయే రోజుల్లో ఈ జాబితాలోకి చేరబోతున్నారని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ప్రస్తుతం బాలీవుడ్ లో బలంగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే, ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా, ధనుష్, మృణాల్ ఠాకూర్ జంట పెళ్లి చేసుకోబోతున్నారని, త్వరలోనే ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్నీ స్వయంగా ఫిలిం ఫేర్ అవార్డ్స్ అధికారిక పేజీ నుండి పబ్లిష్ అవ్వడం తో కచ్చితంగా వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అనేది స్పష్టంగా అర్థం అవుతోంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వార్త గత రెండు రోజుల నుండి బాలీవుడ్ లో ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది, అంతే కాకుండా ఒక సందర్భంలో మీడియా రిపోర్టర్ ఈ వార్తపై మృణాల్ ఠాకూర్ ని స్పందించమని అడిగారట కూడా, కానీ మృణాల్ ఠాకూర్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. మౌనం అర్థాంగీకారం అని పెద్దలు అంటుంటారు కదా, మృణాల్ ఠాకూర్ మౌనం ని కూడా అలాగే అర్థం చేసుకోవాలా?, త్వరలోనే ఈ క్రేజీ జంట ని భార్య భర్తలుగా చూడబోతున్నామా? అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ధనుష్, మృణాల్ ఠాకూర్ కలిసి ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అయినప్పటికీ వీళ్ళ మధ్య రిలేషన్ ఎలా ఏర్పడిందో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Are #Dhanush and #MrunalThakur planning to get married this year?https://t.co/fSeDwJJGTY
— Filmfare (@filmfare) January 16, 2026