Jaali Reddy : ధనుంజయ ఇటీవల వివాహం చేసుకున్నాడు. ఆ వివాహానికి దగ్గరవారిని మాత్రమే పిలిచాడు. వారందరికీ కన్నడ స్టైల్ లో విందు భోజనాలు పెట్టాడు. కన్నడ కల్చర్ ప్రకారమే వివాహ తంతు పూర్తి చేసుకున్నాడు. అయితే ధనుంజయది ప్రేమ వివాహం అని తెలుస్తోంది. తన విషయాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పిన తర్వాత.. వారు ఆమోదించిన తర్వాతే తన ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు వేసినట్టు తెలుస్తోంది. ధనుంజయ వివాహానికి తన చిన్న నాటి స్నేహితులను పిలిచాడు. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి క్రతువుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో పుష్ప చిత్ర యూనిట్ కూడా ధనుంజయకు ప్రత్యేక బహుమతిని పంపించిందని పిలుస్తోంది. పుష్ప చిత్ర యూనిట్ ఎవరూ ఆ పెళ్లిలో కనిపించకపోయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు పుష్ప చిత్ర యూనిట్ కోసం ధనుంజయ ప్రత్యేకంగా రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది.
ఆ పని చేసి ఆదర్శం
కన్నడ సంస్కృతి ప్రకారం పెళ్లి క్రతువు పూర్తి అయిన తర్వాత భార్య భర్త కాళ్లు మొక్కుతుంది. అయితే ఇదే విధానం ప్రకారం అర్చకుడు ధనుంజయ కాళ్ళు మొక్కాలని వధువుకు సూచించాడు. వధువు అతడు చెప్పినట్టుగా చేస్తుండగా.. ధనుంజయ వారించాడు. చివరికి పెద్దలు చెప్పడంతో ఒప్పుకున్నాడు. అయితే ఆమె అతడి కాళ్లు మొక్కగానే.. ధనుంజయ కూడా తిరిగి ఆమె కాళ్లకు నమస్కరించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.. ఈ వీడియోను చూసిన వారంతా ధనుంజయను అభినందిస్తున్నారు..” జాలిరెడ్డి పాత్రలో జాలి లేకుండా నటించాడు. కానీ నిజ జీవితంలో ధనుంజయ జాలి ఉన్న వ్యక్తిగా కనిపిస్తున్నాడు. సినిమా నటుడు అయినప్పటికీ.. కన్నడలో చెప్పుకోదగ్గ స్థాయిలో స్టార్ డం ఉన్నప్పటికీ ధనుంజయ ఏమాత్రం హిప్పోక్రసీ చూపించలేదు. పైగా తను వివాహం చేసుకున్న మహిళ మెడలో మూడు ముళ్ళు వేశాడు. ఆమె కాళ్ళకు నమస్కరించాడు. తద్వారా ఆలుమగలు ఇద్దరు సమానమే అని నిరూపించాడు. అతడు చేసిన ఈ పని చాలామందికి ఆదర్శంగా కనిపిస్తోంది. మగవాళ్ళం అనే ఈగ ఉన్నవారికి కళ్ళు తెరిపించింది. నిజంగా ధనుంజయ గ్రేట్ అని” నెటిజన్లు పేర్కొంటున్నారు. కాగా, ధనుంజయ తన భార్య కాళ్లకు నమస్కరించినప్పుడు గట్టిగా నవ్వాడు. భర్త చేసిన పని చూసిన ఆమె ఒక్కసారి ఆశ్చర్యపోయింది.. అతడు కాల్ మొక్కుతుంటే ప్రారంభంలో వారించింది.. అయినప్పటికీ ధనుంజయ ఊరుకోలేదు. తన భార్యను వారించి అతడు కాళ్ళు మొక్కాడు. ఆమెను ఆశీర్వదించాలని ప్రేమతో కోరాడు.
పుష్ప సినిమాలో జాలి రెడ్డి పాత్రలో నటించిన కన్నడ నటుడు ధనుంజయ ఇటీవల పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగా అర్చకుడు ధనుంజయ కాళ్ళు మొక్కాలని వధువుకు సూచించగా అదే పని చేసింది.. ధనుంజయ కూడా తిరిగి ఆమె కాళ్ళు మొక్కాడు. #Pushpa2 #jalireddy#KannadaDhanunjaya pic.twitter.com/e7MTZtfWn4
— Anabothula Bhaskar (@AnabothulaB) February 22, 2025