
ఏప్రిల్ ఎనిమిదో తారీకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు. కరోనా ప్రభావం తో వేడుకలు , సంబరాలు బంద్ చేసినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అపుడే మొదలయ్యాయి. అల్లు అర్జున్ బర్త్ డే ని పురస్కరించు కొని మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అడ్వాన్స్ గిఫ్ట్ ఇచ్చేసాడు. సోషల్ మీడియా వేదికగా దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఈ బహుమతి కొత్తగా ఉండి అందర్నీ ఆకట్టుకొంటోంది. సోషల్ మీడియా లో విడుదలైన ఈ ఫొటోలో అల్లు అర్జున్ నటించిన వివిధ చిత్రాల్లోని ఫోటోలను దేవిశ్రీ ప్రసాద్ ఎడిట్ చేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. .
అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి తెగ నచ్చేసిన ఈ ఫోటో అడ్వాన్స్ గిఫ్ట్ మాత్రమేనట. అసలు సిసలు గిఫ్ట్ పుట్టినరోజు నాడు ఇవ్వనున్నాడట దేవి శ్రీ ప్రసాద్.
అదలా ఉంటే అల్లు అర్జున్ పుట్టిన రోజున సుకుమార్ , బన్నీ, దేవిశ్రీ ప్రసాద్ కాంబోలో వస్తున్న 20వ సినిమా టైటిల్ , పోస్టర్ కూడా విడుదల కానున్నాయి. ఇక ఈ చిత్రం సుకుమార్ తో బన్నీకాంబోలో మూడో సినిమా కావడం విశేషం. ఇంతకు ముందు వీరిద్దరూ `ఆర్య , ఆర్యా 2 ` చిత్రాల్లో కలిసి పనిచేశారు. ఇక రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తో అల్లు అర్జున్ కి ఇది 10వ సినిమా కావడం విశేషం. ఇంతకూ ముందు వీరిద్దరూ ” ఆర్య , ఆర్యా 2, బన్నీ , శంకర్ దాదా జిందాబాద్ , జులాయి , ఇద్దరమ్మాయిలతో , ఎవడు ,సన్నాఫ్ సత్యమూర్తి , దువ్వాడ జగన్నాధం ” వంటి 9 సినిమాలకు కలిసి పనిచేసారు. ఇపుడు చేయబోయే సుకుమార్ చిత్రం పదోది. మొత్తం బన్నీ చేసిన 20 సినిమాలలో 10 సినిమాలకు దేవి సంగీతం అందించాడంటే వీరిద్దరి అనుబంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అవన్నీ గుర్తు చేసుకొంటూ దేవిశ్రీ ప్రసాద్ అల్లు వారి అబ్బాయికి పుట్టిన రోజు నాడు మరో మంచి బహుమతి ఇవ్వబోతున్నాడట …