https://oktelugu.com/

Devara: ‘హనుమాన్’ ని ముట్టుకోలేకపోయిన ‘దేవర’..ఆ ప్రాంతంలో దరిదాపుల్లోకి కూడా రాలేదుగా!

'దేవర' చిత్రం మాత్రం నాన్ స్టాప్ గా 19 రోజుల పాటు కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి #RRR రికార్డు ని బద్దలు కొట్టింది. కానీ 'హనుమాన్' రికార్డు మాత్రం అందుకోలేక పోయింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 18, 2024 / 05:34 PM IST

    Devara

    Follow us on

    Devara: ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం ప్రారంభంలో డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ, ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ లో టాక్ స్థిరంగా నిలబడడంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయి వసూళ్లను కొల్లగొట్టిందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఓపెనింగ్స్ లో దంచికొట్టిన ఈ సినిమా, లాంగ్ రన్ లో దసరా సెలవులను ఉపయోగించుకొని భారీ వసూళ్లను అందుకుంది. సినిమా విడుదలై 20 రోజులు అయ్యినప్పటికీ కూడా, ఈ చిత్రం ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. అయితే ఈ చిత్రం ఇటీవలే #RRR పేరిట ఉన్న అరుదైన రికార్డుని బద్దలు కొట్టింది. #RRR చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో నాన్ స్టాప్ గా 17 రోజులు కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఈమధ్య కాలంలో ఇంతటి రన్ ఏ సినిమాకి కూడా రాలేదు.

    అయితే ‘దేవర’ చిత్రం మాత్రం నాన్ స్టాప్ గా 19 రోజుల పాటు కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి #RRR రికార్డు ని బద్దలు కొట్టింది. కానీ ‘హనుమాన్’ రికార్డు మాత్రం అందుకోలేక పోయింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘హనుమాన్’ చిత్రానికి వరుసగా 20 రోజుల వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రానికి ముందు రికార్డు బాహుబలి సిరీస్ పేరిట ఉంది. బాహుబలి 2 చిత్రానికి 28 రోజుల వరకు నాన్ స్టాప్ గా కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రాగా, బాహుబలి 1 చిత్రానికి 20 రోజుల వరకు కోటి రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మొదటి స్థానం లో బాహుబలి 2 ఉండగా, రెండవ స్థానంలో హనుమాన్/బాహుబలి1 చిత్రాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాల తర్వాతి స్థానంలో ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం నిల్చింది. ఇప్పుడు ఈ రికార్డుని త్వరలో విడుదల కాబోతున్న ‘గేమ్ చేంజర్’, ‘పుష్ప 2’, ‘హరి హర వీరమల్లు’ చిత్రాలు బద్దలు కొడుతాయో లేవో చూడాలి.

    అయితే ‘దేవర’ చిత్రానికి దొరికిన అదృష్టం ఏమిటంటే, ఇండస్ట్రీ కరువులో ఉన్నప్పుడు విడుదలైన పెద్ద సినిమా, అలాగే దరిదాపుల్లో మరో పెద్ద సినిమా లేకపోవడం వల్ల థియేట్రికల్ రన్ పై ఎలాంటి ప్రభావం పడలేదు. భవిష్యత్తులో విడుదల అవ్వబోతున్న పాన్ ఇండియన్ సినిమాలకు ఈ అదృష్టం లేదు. పుష్ప చిత్రం విడుదలైన నెల రోజుల తర్వాత రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రం రాబోతుంది. అలాగే పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రం విడుదలైన రెండు వారాలకు ప్రభాస్ ‘రాజాసాబ్’ చిత్రం రాబోతుంది. కాబట్టి ‘దేవర’ చిత్రానికి ఉన్నటువంటి ఫ్రీ థియేట్రికల్ రన్ మిగతా పాన్ ఇండియన్ సినిమాలకు దొరికే అవకాశాలు తక్కువ. కాబట్టి ‘దేవర’ పేరిట ఉన్న ఈ అరుదైన రికార్డు ని కొట్టడం అంత సులభం కాదు, ఒకవేళ కొడితే మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు.