Pawan Kalyan Delhi High Court: ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నేడు ఢిల్లీ హై కోర్టు ని ఆశ్రయించాడు. పవన్ కళ్యాణ్ స్థాయి వ్యక్తి హై కోర్టు ని ఆశ్రయించాల్సిన అవసరం ఏముంది?, ఈమధ్య కాలం లో వరుసగా ఆయనపై కేసులు పడడం, ఆ కారణం చేత విచారణ కోసం హై కోర్టుకి రావాల్సి వచ్చిందా?, అసలు ఏమి జరుగుతోంది అని ఈ వార్త వినగానే మీ మదిలో ఎన్నో ఆలోచనలు వచ్చి ఉండొచ్చు. కానీ మీరు ఊహించుకున్న కారణాల వల్ల ఆయన హై కోర్టుని ఆశ్రయించలేదు, తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలి అంటూ ఆయన హై కోర్టు మెట్లు ఎక్కాడు. గత రెండు రోజులుగా వైసీపీ పార్టీ కి చెందిన కొంతమంది సోషల్ మీడియా కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను AI ని ఉపయోగించి జగన్ కాళ్ళు మొక్కుతున్నట్టుగా చూపించారు.
అలా ఒకటి కాదు రెండు కాదు, చాలా ఫొటోలే వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుండి ఇలాంటివి చేస్తూనే ఉన్నారు కానీ, రీసెంట్ గా చేసినవి మాత్రం ఆయన దృష్టిలోకి వెళ్లాయి. దీంతో వ్యక్తిత్వ హక్కులను కాపాడాలంటూ ఆయన హై కోర్టు ని ఆశ్రయించాడు. తన పై సోషల్ మీడియా AI ద్వారా మార్ఫింగ్ చేస్తూ అప్లోడ్ చేసిన ఫోటోల లింక్స్ ని రాబోయే 48 గంటలోపు తమకు అందించమని న్యాయమూర్తి సూచించినట్టు సమాచారం. వీటిపై వారం లోపు చర్యలు తీసుకోవాలని గూగుల్, మెటా తదితర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను ఆదేశించారు. తదుపరి విచారణను డిసెంబర్ 22 కు వాయిదా వేశారు. ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో సెలబ్రిటీలపై ఇలాంటి చర్యలు సర్వసాధారణం అయిపోతున్నాయి. అందుకే సెలబ్రిటీలు తమ రక్షణ కోరుతూ హై కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ముందుగా ఇది ఐశ్వర్య రాయ్ తో మొదలైంది.
ఆమె హై కోర్టు లో తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలంటూ పిటీషన్ వేసింది, ఆ తర్వాత ఆమె భర్త అభిషేక్ బచ్చన్, హృతిక్ రోషన్ వంటి వారు ఇదే అనుసరించారు. ఇక మన టాలీవుడ్ విషయానికి వస్తే ముందుగా నాగార్జున హై కోర్టు ని ఆశ్రయించగా, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు కూడా హై కోర్టు ని ఈ విషయం పై ఆశ్రయించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా హై కోర్టు ని ఆశ్రయించడం విమర్శలకు దారి తీస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రభుత్వం లో ఉప ముఖ్యమంత్రి హోదా లో కూర్చొని పాలించే స్థానం, లో ఉన్నాడు. సోషల్ మీడియా లో ఇలాంటివి కంట్రోల్ చేసే స్థాయిలో ఉన్న ఆయనే ఇలా హై కోర్టుని ఆశ్రయయిస్తే, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు నెటిజెన్స్.