Hari Hara Veeramallu Deleted scene : కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టు, పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) ఫ్లాప్ అవ్వడానికి అన్ని కారణాలు ఉన్నాయి అనేది వాస్తవం. ఎప్పుడైతే ఈ సినిమా నుండి డైరెక్టర్ క్రిష్(Krish Jagarlamudi) తప్పుకున్నాడో, అప్పుడే ఈ సినిమా అస్సాం ట్రైన్ ఎక్కింది. క్రిష్ ఈ చిత్రం కోసం చేసిన పరిశోధన సాధారణమైనది కాదు. ఎన్నో వందల పుస్తకాలు చదివి స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడు. ఆయన తయారు చేసుకొని స్క్రిప్ట్ ప్రకారం కథ ఏమిటంటే, కొల్లూరు మైన్స్ లో దొరికిన కోహినూర్ వజ్రం అనేక చేతులు మారి ఔరంగజేబు నెమలి సింహాసనం మీదకు చేరుతుంది. దానిని దొంగలించి తీసుకొని రావడం కోసం ‘హరి హర వీరమల్లు’ బయలుదేరుతాడు. ఆ క్రమం లో ఆయన తన గుర్తింపుని కూడా మార్చుకుంటాడు. ఔరంగజేబు కోటలోకి ప్రవేశించిన తర్వాత నెమలి సింహాసనం మీద ఉన్న వజ్రాన్ని దొంగిలించడం అంత తేలికైన విషయం కాదు.
మృత్యువుతో పోరాటం చేసినట్టే. ఆ ఘట్టాన్ని మొత్తం ఎంతో అద్భుతంగా చూపించి ఉండొచ్చు. కోహినూర్ ని దొంగతనం చేసే సన్నివేశాన్ని కూడా క్రిష్ తెరకెక్కించాడు. కానీ ఆ సన్నివేశాన్ని ఎడిటింగ్ లో లేపేసాడు. స్టోరీ క్రిష్ రాసిన విధంగానే తీసి ఉండుంటే అద్భుతంగా ఉండేది. కేవలం మన తెలుగు లోనే కాకుండా, ఇతర భాషల్లో కూడా ప్రభంజనం సృష్టించి ఉండేది. కానీ క్రిష్ వెళ్లిపోయిన తర్వాత, జ్యోతి కృష్ణ వచ్చాక ఈ చిత్రం రూపు రేఖలు మొత్తం మార్చేసి, సనాతన ధర్మం కాన్సెప్ట్ మీద నడిపించాడు. అక్కడే మొత్తం తేడా కొట్టేసింది. సినిమాలో మనం చూసిన క్లైమాక్స్ సన్నివేశం ప్రీ ఇంటర్వెల్ లో రావాల్సినది. అంటే ఎక్కడి కథ ఎక్కడికి వెళ్లిందో మీరే అర్థం చేసుకోండి. అద్భుతమైన కథని డైరెక్టర్ జ్యోతి కృష్ణ నాశనం చేసి పారేసాడు. మొదట క్రిష్ తో పవన్ చర్చలు చేసినప్పుడు కేవలం 80 రోజుల్లోనే షూటింగ్ ని పూర్తి చెయ్యాలని అనుకున్నారు.
అనుకున్న ప్లాన్ ప్రకారమే అప్పట్లో పవన్ కళ్యాణ్ నాన్ స్టాప్ గా డేట్స్ ఇచ్చాడు, డైరెక్టర్ క్రిష్ జెట్ స్పీడ్ లో సగానికి పైగా సినిమాని చిత్రీకరించాడు. కానీ ఆ తర్వాత వచ్చిన కరోనా ఈ సినిమా పాలిట శాపం లాగా మారింది. అయితే అప్పట్లో డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన సన్నివేశాల్లో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. అదేంటో మీరే చూడండి. రాజకోట లో పవన్ కళ్యాణ్ తలపాగా చుట్టుకోవడం, అతని అనుచరులు ఎదో నినాదాలు చేయడం వంటివి ఈ వీడియో లో మనం చూడవచ్చు. అంటే కోహినూర్ డైమండ్ కోసం హీరో రాజకోటలోకి అడుగుపెట్టేసాడు అన్నమాట. ఈ వీడియో ని చూసి అభిమానుల కడుపు రగిలిపోతుంది. ఎంతో గొప్పగా వచ్చే సినిమాని చివరికి ఇలా చూడాల్సి వచ్చింది అంటూ వాపోతున్నారు.
#HariHaraVeeraMallu – Deleted Sequence… Under the guidance of Krish Jagaralamudi #PawanKalyan pic.twitter.com/IbHz0ehdZA
— Telugu Chitraalu (@CineChitraalu) July 26, 2025