Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ తెలుగు 8లో బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్… మేకర్స్ అంత రిస్క్ చేస్తారా?

Bigg Boss Telugu 8 కానీ మరోవైపు దీపికా రంగరాజు బ్రహ్మముడి సీరియల్ లో లీడ్ రోల్ చేస్తుంది. కాబట్టి ఆమె సీరియల్ లో లేకపోతే ఆ ప్రభావం రేటింగ్ పై పడుతుంది. మరి చూడాలి ఏం జరగనుందో

Written By: NARESH, Updated On : June 18, 2024 5:59 pm

Deepika Rangaraju is the heroine of Brahmamudi serial in Bigg Boss Telugu 8

Follow us on

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. సీజన్ 7 సూపర్ సక్సెస్ అని చెప్పాలి. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. బుల్లితెరపై నంబర్ వన్ షో గా నిలిచింది. ఈ జోష్ లోనే మేకర్స్ సీజన్ 8 ని అనుకున్న సమయానికి ముందే తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సీజన్ 8 కి సర్వం సిద్ధం అవుతుంది. ఈ సీజన్లో పార్టిసిపేట్ చేయబోయే కంటెస్టెంట్స్ వీరే అంటూ కొందరు సెలెబ్స్ పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా మరో బ్యూటీ పేరు తెరపైకి వచ్చింది. బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ దీపికా రంగరాజు బిగ్ బాస్ 8 లో పార్టిసిపేట్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీపికా రంగరాజు తక్కువ సమయంలోనే ప్రేక్షకులకు దగ్గరైంది. బుల్లితెర పై మంచి గుర్తింపు తెచ్చుకుంది. బ్రహ్మముడి సీరియల్ లో కావ్య పాత్రలో అద్భుతంగా నటిస్తుంది. తమిళ నటి అయినప్పటికీ తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది.

అంతేకాదు దీపికా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటుంది.ఓ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది. ఫ్యాన్స్ తో తన వ్యక్తిగత విషయాలు, సీరియల్ అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. అలా మరింత క్రేజ్ పెంచుకుంటుంది. సీరియల్ లో చాలా సీరియస్ గా కనిపించే కావ్య .. బయట మాత్రం మామూలుగా అల్లరి చేయదు. స్టార్ మా షోలు, ఈవెంట్స్ లో దీపికా తన తోటి ఆర్టిస్టులకి చుక్కలు చూపిస్తుంటుంది.

అలాంటి అల్లరి పిల్ల బిగ్ బాస్ లో ఉంటే రచ్చ ఓ రేంజ్ లో ఉంటుంది. బిగ్ బాస్ మేకర్స్ కి కూడా కంటెంట్ ఇచ్చే వాళ్ళు ప్రధానం కాబట్టి దీపికా రంగరాజుని సెలెక్ట్ చేశారని తెలుస్తుంది. దీపికా కనుక బిగ్ బాస్ 8 లో పార్టిసిపేట్ చేస్తే ఎంటర్టైన్మెంట్ కి మాత్రం లోటు ఉండదు అని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. కానీ మరోవైపు దీపికా రంగరాజు బ్రహ్మముడి సీరియల్ లో లీడ్ రోల్ చేస్తుంది. కాబట్టి ఆమె సీరియల్ లో లేకపోతే ఆ ప్రభావం రేటింగ్ పై పడుతుంది. మరి చూడాలి ఏం జరగనుందో