Deepika Padukone: స్పిరిట్, కల్కి వంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాల నుండి తప్పుకొని దీపికా పదుకొనే(Deepika Padukone) ఈమధ్య కాలం లో వార్తల్లో సెన్సేషనల్ టాపిక్ గా నిల్చింది. స్పిరిట్ మూవీ దర్శకుడు సందీప్ వంగ, అదే విధంగా ‘కల్కి’ మేకర్స్ ఈ విషయం పై నేరుగానే దీపికా పదుకొనే పై అసహనం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా పోస్టులు వేశారు. ఒక స్టార్ హీరోయిన్ పై మూవీ టీమ్స్ నేరుగా ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు. ఈ విషయం లో కచ్చితంగా దీపికా పదుకొనే తప్పు ఉందని, ఆమె పెట్టిన డిమాండ్స్ ని తట్టుకోలేకనే ఈ రెండు మూవీ టీమ్స్ ఆమెని తప్పించాయని బాలీవుడ్ నుండి కొలీవూడ్ కోడై కూస్తోంది. కానీ రీసెంట్ గా ఒక ప్రముఖ నేషనల్ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన దీపికా పదుకొనే ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఈ ఇంటర్వ్యూ లో ఆమె తనపై వచ్చిన వ్యాఖ్యలపై చాలా ఘాటుగానే స్పందించింది. ఆమె మాట్లాడుతూ ‘మనం ప్రస్తుతం మేల్ డామినేటెడ్ సినీ ఇండస్ట్రీ లో ఉంటున్నాము. ఒక మేల్ సూపర్ స్టార్ రోజుకి 8 గంటలు పని చెయ్యాలని రూల్ ఎక్కడా లేదు . కానీ హీరోయిన్స్ దగ్గర మాత్రం ఈ రూల్ ఉంటుంది.అనేక ఆంక్షలు ఉంటాయి. దీనికి నేను పూర్తిగా వ్యక్తిరేకిని. ఇండస్ట్రీ లో ఒక పద్దతి లేదు. రీసెంట్ గానే నేను ఒక సినిమాకు ఇలాంటి నో చెప్పాను. అది న్యూస్ లో పెద్ద హైలైట్స్ గా మారింది’ అంటూ చెప్పుకొచ్చింది దీపికా పదుకొనే. ఆమె మాట్లాడిన ఈ మాటలను బట్టీ చూస్తే, ఆమె ఎందుకు ఆ రెండు సినిమాల నుండి తప్పుకోవాల్సి వచ్చిందో సోషల్ మీడియా లో ప్రచారమైన కారణాలు నిజమే అని ఇప్పుడు అనిపిస్తుంది. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఆమె వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ని మీరు కూడా చూసేయండి.
#DeepikaPadukone reacts to reports claiming she was dropped from #Prabhas’s #Kalki2898AD sequel due to “excessive demands,” as stated by the producers.pic.twitter.com/vdmHkkAjOz
— Milagro Movies (@MilagroMovies) October 10, 2025