
1987లో దూరదర్శన్ లో వచ్చిన పౌరాణిక సీరియల్ `రామాయణ్ ‘ దేశవ్యాప్తంగా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సీరియల్ లో నటించిన వారంతా రాత్రికి రాత్రే స్టార్ నటులు అయిపోయారు. మరీ ముఖ్యంగా రాముడుగా నటించిన అరుణ్ గోవిల్, సీతగా నటించిన దీపికా చికిలియా టి వి ప్రేక్షకుల ఆరాధ్య దైవాలై పోయారు. ఆ తరవాత వాళ్ళు సినిమాల్లో నటించినా గాని బుల్లితెర ఇమేజ్ నుంచి బయట పడ లేక పోయారు .
మందు ఓపెన్.. గుడులు, పనులు బంద్ న్యాయమా?
కాగా ఈ సీరియల్ లో సీతగా నటించిన దీపికా చికిలియా ప్రస్తుతం బాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది. గతంలో దీపికా చికిలియా తెలుగులో “యమపాశం , బ్రహ్మర్షి విశ్వామిత్ర” సినిమాల్లో నటించడం కూడా జరిగింది. తాజాగా దీపికా చికిలియా ఒక బయోపిక్ లో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ప్రముఖ దేశభక్తురాలు, స్వాతంత్ర్య సమరయోధురాలు అయిన సరోజిని నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న ‘సరోజిని’ చిత్రంలో దీపికా చికిలియా టైటిల్ రోల్ పోషిస్తున్నారు.
ప్రజారవాణాలో మార్పులు చేర్పులు!
ప్రస్తుత లాక్ డౌన్ లో దీపికా చికిలియా నటించిన ‘రామాయణ్’ మరోసారి ప్రేక్షకుల కోరిక మేరకు దూరదర్శన్ లో ప్రసారమవుతోంది. అంతేకాదు బుల్లితెర వీక్షకుల మనసు మళ్ళీ గెలుచు కొంటోంది .
అప్పట్లో రామాయణ్ సీరియల్ తెచ్చిపెట్టిన పాపులారిటీ తో 1991 సంవత్సరంలో బీజేపీలో చేరిన దీపికా చికిలియా బరోడా నుంచి బి. జె. పి ఎంపీగా గెలవడం కూడా జరిగింది.