Anushka Shetty Brother: అనుష్క శెట్టి.. చలన చిత్ర పరిశ్రమలో పరిచయం చేయాల్సిన అవసరం లేని నటి. నాగార్జున హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ధూమ్ సినిమాకు రీమేక్ గా విడుదలైన సూపర్ సినిమా ద్వారా ఆరంగేట్రం చేసింది. ఆ సినిమా నుంచి “నిశ్శబ్దం” వరకు ఎన్నో సినిమాల్లో నటిగా నటించి మెప్పించింది. అరుంధతి, బాహుబలి, బాహుబలి 2, భాగమతి సినిమాలు ఆమెను చిరస్థాయిగా నిలబెట్టాయి. తాజాగా అనుష్క శెట్టి సోదరుడు గుణ రంజన్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. దీంతో అనుష్క శెట్టి కుటుంబం ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది.

కర్ణాటకను ముత్తప్పరై అనే గ్యాంగ్ స్టర్ శాసించినప్పుడు అతనికి మన్విత్ రై, గుణ రంజన్ శెట్టి కుడి, ఎడమ భుజాలుగా వ్యవహరించేవారు. ముత్తప్ప రై కన్ను మూసిన తరువాత మన్విత్, గుణ రంజన్ ఇద్దరూ విడిపోయారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు పెంచుకున్నారు. ఈ సమయంలో ముత్తప్ప రై స్థాపించిన జయ కర్ణాటక సంఘం నుంచి కూడా గుణ రంజన్ బయటకు వచ్చాడు. ఆ తర్వాత తన అనుచరులతో బెంగళూరు, మంగళూరులో జయ కర్ణాటక జనపర వేదిక ఏర్పాటు చేశాడు. ఆ సంస్థ ద్వారా వివిధ కార్యక్రమాలు చేస్తున్నాడు.
Also Read: Anasuya Bharadwaj: అనసూయ అందాలు అదరహో … ఎదపై టాటూ చూపిస్తూ నాటీ ఫోజులిచ్చిన హాట్ యాంకర్!

అతడు అంతకంతకూ ఎదుగుతూ ఉండడంతో మన్విత్ పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే గుణ రంజన్ ను హత్య చేసేందుకు మన్విత్ కుట్ర చేస్తున్నారని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. ఆదివారం సాయంత్రం కర్ణాటక రాష్ట్ర హోం మంత్రి జ్ఞానేంద్ర ను కలిసి తమ నాయకుడు గుణ రంజన్ కు ప్రాణభయం ఉందని, పోలీసులు భద్రత కల్పించాలని లిఖితపూర్వకంగా కోరారు. ఈ ఘటన బెంగళూరు, మంగళూరులో సంచలనం రేకెత్తించింది. మరోవైపు ఈ ఘటనపై మన్విత్ రై స్పందిస్తూ తాను ఇప్పుడు దేశాల్లో ఉన్నానని, తనకు ఎటువంటి సంబంధం లేదని వివరించాడు. కాగా అనుష్కకు ఇద్దరు సోదరులు. వారిలో ఒకరు గుణ రంజన్, ఇంకొకరు సాయి రమేష్. ప్రస్తుతం సాయి రమేష్ కర్ణాటకలో వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు.
Also Read:Prathyusha Garimella: ప్రత్యూష ఆత్మహత్యలో షాకింగ్ నిజాలు.. పదిరోజుల ముందే ఆ పని చేసిందట!
[…] […]