Prabhas: ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఆయన నుండి రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. ఆదిపురుష్ ఆల్రెడీ విడుదలైంది. రామాయణ గాథగా తెరకెక్కిన ఆదిపురుష్ అంతగా ఆకట్టుకోలేదు. పైగా రామాయణంలోని పాత్రలు, సన్నివేశాల రూపు రేఖలు మార్చేశారన్న విమర్శలు వినిపించాయి. దర్శకుడు ఓం రౌత్ తీవ్ర ట్రోలింగ్ కి గురయ్యాడు. అయితే సలార్ మూవీతో ప్రభాస్ ఫ్యాన్స్ దాహం తీర్చుతాడని గట్టిగా నమ్ముతున్నారు. సలార్ డిసెంబర్ 22న విడుదల కానుంది. యూఎస్ లో బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.
సలార్ భారీ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయంగా కనిస్తుంది. అలాగే ప్రభాస్-నాగ్ అశ్విన్ ల కాంబోలో తెరకెక్కుతున్న కల్కి సెట్స్ పై ఉంది. కమల్ హాసన్, అమితాబ్, దీపికా పదుకొనె, దిశా పటాని వంటి స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ అంశాలతో సైంటిఫిక్ మూవీగా తెరకెక్కుతుంది. సెట్స్ పై ఉన్న మరో ప్రభాస్ మూవీ రాజా డీలక్స్. టైటిల్ నిర్ణయించుకున్నప్పటికీ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి రాజా డీలక్స్ అనే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
కాగా రాజా డీలక్స్ కి ముందే ప్రభాస్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ఓ మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే. స్పిరిట్ టైటిల్ గా నిర్ణయించారు. ఈ మూవీ గురించి కీలక అప్డేట్ అందుతుంది. స్పిరిట్ వచ్చే ఏడాది సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుందట. సందీప్ రెడ్డి వంగా ప్రసుతం యానిమల్ మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. రన్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న యానిమల్ చిత్రం డిసెంబర్ 1న విడుదల కానుంది.
యానిమల్ ట్రైలర్ విశేష ఆదరణ దక్కించుకుంది. యాక్షన్ కి మించి లోతైన ఎమోషన్స్ తో సందీప్ రెడ్డి వంగా యానిమల్ తెరకెక్కించారని అర్థం అవుతుంది. యానిమల్ విడుదలైన వెంటనే ప్రభాస్ మూవీ పనులు స్టార్ట్ చేస్తాడట. ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసి సెప్టెంబర్ కల్లా స్పిరిట్ సెట్స్ పైకి తీసుకెళ్లాలన్నారని టాలీవుడ్ టాక్. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ప్రభాస్ మూవీ మరింత వైలెంట్ గా ఉంటుంది. ఆయన్ని ఓ రేంజ్ లో చూపిస్తానని గతంలో సందీప్ రెడ్డి వంగా అన్నారు.