https://oktelugu.com/

Daku Maharaj : ‘డాకు మహారాజ్’ 18 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఆంధ్రలో లాభాలు..నైజాం, సీడెడ్ లో భారీ నష్టాలు!

నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'డాకు మహారాజ్' ఈ సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.

Written By: , Updated On : January 30, 2025 / 08:05 AM IST
Daku Maharaj

Daku Maharaj

Follow us on

Daku Maharaj : నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘డాకు మహారాజ్’ ఈ సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే, ఈ సినిమాకి పాజిటివ్ టాక్ కి తగ్గట్టుగా కలెక్షన్స్ రాకపోవడమే. ఓపెనింగ్స్ అదిరిపోయాయి, సంక్రాంతి సెలవల్లో దంచి కొట్టేసింది. కానీ మామూలు వర్కింగ్ డేస్ లో మాత్రం కనీస స్థాయి వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. 18వ రోజు ఈ చిత్రానికి 8 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. అవతల వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ఇంకో మూడు వారాల పాటు ఎలాంటి అడ్డు అదుపు లేకుండా థియేటర్స్ లో నడిచే పరిస్థితిలో ఉంటే, డాకు మహారాజ్ మాత్రం ఈ వారంతో క్లోజింగ్ కి దగ్గర్లో ఉంది. పాజిటివ్ టాక్ తెచ్చుకొని సంక్రాంతి సీజన్ లో ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేని సినిమాగా ఈ చిత్రం రికార్డ్స్ కి ఎక్కుదేమో.

ఈ సినిమా థియేట్రికల్ రన్ ని చూసిన తర్వాత అర్థమైంది ఏమిటంటే బాలయ్య బాబు సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్ ఇప్పటికీ థియేటర్స్ కి వెళ్లి చూసే పరిస్థితులు లేవు. దీనిని బట్టి ఆయన కరోనా లాక్ డౌన్ కి ముందు రెండు దశాబ్దాలు ఎలాంటి కళాఖండాలు అందించాడో ఊహించుకోండి. ప్రతీసారి సంక్రాంతికి వస్తున్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆయన సినిమాలకు 50 కోట్ల రూపాయలకు మించి షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదంతా పక్కన పెడితే ‘డాకు మహారాజ్’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 82 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 18 రోజులకు గాను ఈ చిత్రానికి 74 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. అది కూడా రిటర్న్ జీఎస్టీ కలిపితేనే.

రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది. అయినప్పటికీ ‘డాకు మహారాజ్’ క్లోజింగ్ ‘గేమ్ చేంజర్’ మొదటి వారం వసూళ్ల కంటే తక్కువే ఉంది. ఇదంతా పక్కన పెడితే ఆంధ్ర ప్రాంతం లో తప్ప, ఈ సినిమా నైజాం, సీడెడ్ ప్రాంతాల్లో భారీ నష్టాలను తెచ్చిపెట్టిందని అంటున్నారు ట్రేడ్ పండితులు. నైజాం ప్రాంతం నందమూరి హీరోలకు బాగా వీక్ అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ కంచుకోట లాంటి సీడెడ్ లో కూడా వెంకటేష్ సినిమా దాటికి నిలబడలేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఓవర్సీస్ లో ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది కానీ, నార్త్ అమెరికా లో మాత్రం యావరేజ్ గా నిల్చింది. ఈ వీకెండ్ కూడా ఈ చిత్రానికి రన్ వచ్చే అవకాశాలు ఉండడంతో మరో కోటి నుండి రెండు కోట్ల రూపాయిలు క్లోజింగ్ కలెక్షన్స్ కి యాడ్ అవ్వొచ్చని అంటున్నారు ట్రేడ్ పండితులు.