Dacoit movie first day collections: అడివి శేష్(Adivi Sesh) హీరోగా నటించిన ‘డెకాయిట్'(Dacoit Movie) చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై డీసెంట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి ఆట లో భారీ అంచనాల కారణంగా కాస్త డివైడ్ టాక్ వచ్చిన విషయం వాస్తవమే కానీ, ఆ తర్వాత ఫస్ట్ షోస్ కి టాక్ కాస్త స్థిరపడింది. అడివి శేష్ గత చిత్రాలతో పోలిస్తే అవుట్ ఆఫ్ ది బాక్స్ కథ , స్క్రీన్ ప్లే ఇందులో లేదు కానీ, కచ్చితంగా మంచి సినిమానే అని చూసిన ప్రతీ ఒక్కరు అంటున్నారు. దాకా కాస్త డీసెంట్ గా ఉండడంతో , ఈ చిత్రానికి ఓపెనింగ్స్ కూడా అదే రేంజ్ లో వచ్చాయి. ట్రేడ్ విశ్లేషకులు 10 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తుందని అనుకుంటే, ఈ చిత్రానికి అంతకు మించే వసూళ్లు వచ్చాయని అంటున్నారు.
వరుస సూపర్ హిట్స్ తో అడివి శేష్ ఆడియన్స్ లో తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకోవడం వల్లే , ఈ చిత్రానికి భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగడమే కాకుండా, కౌంటర్ బుకింగ్స్ కూడా అదిరిపోయే రేంజ్ లో జరిగిందని అంటున్నారు. ఈ చిత్ర నిర్మాతలు మొదటి రోజు 15 కోట్ల రూపాయలకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ వసూళ్లు వచ్చిందని పోస్టర్ ని విడుదల చేయగా, ట్రేడ్ లో వాస్తవంగా వచ్చిన వసూళ్లు 14 కోట్ల రూపాయిల గ్రాస్ వరకు ఉంటుందని అంటున్నారు. అందులో కేవలం నైజాం ప్రాంతం నుండి 2 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి అని, అందులో 2 కోట్ల రూపాయిలు హైదరాబాద్ సిటీ నుండే వచ్చిందని అంటున్నారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ నుండి అయితే ఈ చిత్రానికి 2.2 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చింది.
ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం అనుకున్న స్థాయిలో వసూళ్లు రాలేదు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం లో అయితే ఈ చిత్రానికి కేవలం 35 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బయ్యర్స్ కి ఈ ప్రాంతం లో భారీ నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ఆన్లైన్ నుండి వరల్డ్ వైడ్ గా ట్రాక్ అయిన గ్రాస్ వసూళ్లు 14 కోట్ల రూపాయిలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 5 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తే , అమెరికా నుండి ఏకంగా 5 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి మరో 2 కోట్ల రూపాయిల గ్రాస్ , రెస్ట్ ఆఫ్ వరల్డ్ నుండి మరో కోటి 50 లక్షల గ్రాస్ వచ్చి ఉంటుందని అంటున్నారు. ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు వెర్షన్ నుండి 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.