Daaku Maharaaj: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ చిత్రం ‘డాకు మహారాజ్'(Daaku Maharaj) బాక్స్ ఆఫీస్ వద్ద బాలయ్య ఖాతాలో మరో సూపర్ హిట్ గా నిల్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో అన్ని ప్రాంతీయ భాషల్లో స్ట్రీమింగ్ చేయడం మొదలుపెట్టారు. రెస్పాన్స్ మామూలు రేంజ్ లో లేదు. సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన ఈ సినిమాకి సంబంధించిన సన్నివేశాలే కనిపిస్తున్నాయి. బాలయ్య నటన, తమన్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి కేవలం తెలుగు ఆడియన్స్ నుండి మాత్రమే కాదు, ఇతర భాషలకు సంబంధించిన ఆడియన్స్ నుండి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. #RRR , పుష్ప 2(Pushpa 2 Movie) తర్వాత విదేశీయులు ఒక సినిమా గురించి పొగుడుతూ ట్వీట్స్ వేయడం కేవలం ‘డాకు మహారాజ్’ చిత్రానికి మాత్రమే జరిగింది. ఈ చిత్రం లోని యాక్షన్ సన్నివేశాలు రోమాలు నిక్కపొడిచే రేంజ్ లో ఉన్నాయని అంటున్నారు.
ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 18 దేశాల్లో ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతుందంటే సాధారణమైన విషయం కాదు. ‘పుష్ప 2’ 22 దేశాల్లో ట్రెండ్ అయ్యి నెంబర్ 1 స్థానంలో నిలబడగా, ‘డాకు మహారాజ్’ 18 దేశాల్లో ట్రెండ్ అవుతూ రెండవ స్థానంలో నిల్చింది. అయితే ఈ చిత్రం అత్యధిక వారాలు ట్రెండ్ అయ్యి #RRR , దేవర, లక్కీ భాస్కర్ వంటి సినిమాల క్యాటగిరీ లో నిలిస్తుందో లేదో చూడాలి. పై చిత్రాలన్నీ 9 వారాలకు పైగా ట్రెండ్ అయ్యాయి. లక్కీ భాస్కర్ చిత్రం అయితే ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. మరి ఆ స్థాయి రెస్పాన్స్ డాకు మహారాజ్ కి దక్కుతుందో లేదో చూడాలి. ఈ సినిమాలో ఉన్న కంటెంట్ కి వచ్చిన వసూళ్లు సరిపోలేదని అభిమానుల అభిప్రాయం. టాక్ కి తగ్గ కలెక్షన్స్ రాలేదని ట్రేడ్ వర్గాలు కూడా చెప్పాయి.
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ మేనియా దెబ్బ ఈ చిత్రం పై చాలా బలంగా పడింది. కానీ థియేటర్స్ లో అనుకున్న అంచనాలను రీచ్ కాలేకపోయినప్పటికీ, ఓటీటీ లో సెన్సేషనల్ రెస్పాన్స్ రావడం పై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే బాలయ్య బాబు ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో ‘అఖండ 2’ చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం కేవలం అభిమానులు మాత్రమే కాదు, ప్రేక్షకులు కూడా భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో విరామం లేకుండా ఈ సినిమా షూటింగ్ సాగుతుంది. ఎట్టిపరిస్థితిలో సెప్టెంబర్ 25 న విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం లో సంజయ్ దత్ మెయిన్ విలన్ గా నటిస్తుండగా, యువ హీరో ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఉగాదికి ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.