Bollywood Beauties: ఇండియాలో రెండింటికి మాత్రమే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందులో ఒకటి సినిమా, రెండోది క్రికెట్. ఈ రెండింటిలో రాణించే వారికి దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. అయితే ఈ రెండింటికి ఓ లింక్ కూడా ఉందండోయ్. ఇప్పటికే చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు స్టార్ క్రికెటర్లతో ప్రేమాయణం నడిపించారన్న విషయం అందరికీ విదితమే. ఇందులో కొన్ని జంటలు మాత్రమే పెండ్లి వరకు వెళ్లాయి. కానీ చాలా జంటలు కొద్ది కాలంలోనే విడిపోయాయి. ఇలా విడిపోయిన జంటల గురించి ఓ లుక్ వేద్దాం.

ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ గురించి. ఈ క్రికెటర్ తొలినాళ్లలో క్రికెట్ ఆడుతున్న క్రమంలోనే బాలీవుడ్ నటి కిమ్ శర్మతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. కిమ్ శర్మ ఎవరో కాదండోయ్ తెలుగులో వచ్చిన ఖడ్గం మూవీలో హీరోయిన్ గా కూడా చేసింది. అంతే కాదు రాజమౌళి తెరకెక్కించిన మగధీర మూవీలో ఐటమ్ సాంగ్ చేసింది. కాగా వీరి ప్రేమకు పెద్దలు ఒప్పుకున్నా చివరకు ఏవో కారణాలతో విడిపోయారు.
ఇక వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ సర్ వివియన్ రిచర్డ్స్ తో దాదాపు కొన్నేండ్ల పాటు డేటింగ్ చేసింది బాలీవుడ్ హీరోయిన్ నీనా గుప్తా. వీరి సహజీవనంలో మసాబా అనే కుమార్తె కూడా జన్మించింది. వీరు మాత్రం పెళ్లి చేసుకోలేదు. ఇక వీరి తర్వాత స్టార్ బౌలర్ జహీర్ ఖాన్ బాలీవుడ్ నటి అయిన ఇషా శర్వాణితో చాలా కాలం ప్రేమాయణం సాగించాడు. కానీ చివరకు చిన్న చిన్న కారణాలతో విడిపోయారు. ఇక రవిశాస్త్రి గతంలో అమృతా సింగ్ మధ్య లవ్ ఎఫైర్ ఉందని అప్పట్లో చాలా పెద్ద వార్తలే వచ్చాయి. కానీ త్వరగానే వీరి బంధానికి బ్రేకులు పడ్డాయి.
Also Read: Hero Surya: చిరు ఆచార్యకు గట్టి పోటీగా మాస్ మూవీతో వస్తోన్న సూర్య
ఇక సోఫియా హయత్, రోహిత్ శర్మల ప్రేమాయణం కూడా వేగంగానే ముగిసింది. ఇక ధోనీ విషయానికి వస్తే రాయ్ లక్ష్మీతో డేటింగ్ చేశాడనే వార్తలు వచ్చాయి. కానీ ఏడాదిలోపే వీరిద్దరూ విడిపోయారు. ఇక ధోనీ సాక్షిని పెండ్లి చేసుకున్నాడు. ఇక ఇప్పటి తరంలో రిషబ్ పంత్ అలాగే ఊర్వశిరౌతెలా గురించి కూడా బాగానే రూమర్లు వినిపిస్తున్నాయి. కానీ ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. క్రికెటర్లు అందరూ ఇలా స్టార్ హీరోయిన్లతో డేటింగ్ చేసి చాలామంది పెళ్లి చేసుకోకుండానే విడిపోతున్నారు.
Also Read: Sai Dharam Tej: మృత్యుంజయా ముసుగులో ఇంకెన్నాళ్లు… ఒక్కసారి మాట్లాడొచ్చుగా !