మెగా మేనల్లుడికి మాత్రమే దక్కిన క్రెడిట్  !

మెగా మేనల్లుడు  వైష్ణ‌వ్‌ తేజ్ ‘ఉప్పెన’ అనే చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం కాబోతున్నాడు.  వైష్ణ‌వ్‌ తేజ్ తో పాటు బుచ్చిబాబు సానా అనే సుకుమార్ అసిస్టెంట్ ను కూడా దర్శకుడిగా పరిచయం చేస్తూ  మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌  ఈ సినిమాను స్వచ్ఛమైన ప్రేమ కథగా తీసుకొస్తుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా కూడా ఓటిటీలో రిలీజ్ కాబోతుందని తెలుస్తోంది. నాని ‘వి’తో మొదలైన డిజిటల్ […]

Written By: Neelambaram, Updated On : September 14, 2020 11:10 am

Credit only to Mega Nephews !

Follow us on

మెగా మేనల్లుడు  వైష్ణ‌వ్‌ తేజ్ ‘ఉప్పెన’ అనే చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం కాబోతున్నాడు.  వైష్ణ‌వ్‌ తేజ్ తో పాటు బుచ్చిబాబు సానా అనే సుకుమార్ అసిస్టెంట్ ను కూడా దర్శకుడిగా పరిచయం చేస్తూ  మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌  ఈ సినిమాను స్వచ్ఛమైన ప్రేమ కథగా తీసుకొస్తుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా కూడా ఓటిటీలో రిలీజ్ కాబోతుందని తెలుస్తోంది. నాని ‘వి’తో మొదలైన డిజిటల్ విడుదల పరంపరలో మొత్తానికి ఉప్పెన కూడా చేరబోతోంది.  ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని.. ఈ సినిమాకి సదరు ఓటిటి  సంస్థ భారీ మొత్తం ఆఫర్ చేస్తోందని తెలుస్తోంది.
Also Read : పవన్ కళ్యాణ్.. ‘ఓం శివమ్’ !
 

కాకపోతే  నిర్మాతలు – ఓటిటీ సంస్థకు మధ్య ఇంకా ఆర్ధిక లావాదేవీలు కొనసాగుతున్నాయట. వైష్ణ‌వ్‌ తేజ్ కి మొదటి సినిమాతోనే మంచి మార్కెట్ క్రియేట్ అయింది.  నిజానికి ఏ యాక్షన్ కథతోనే లేక కామెడీ సినిమాతోనే వైష్ణ‌వ్‌ తేజ్ లాంచ్ అయితే.. రెగ్యులర్ సినిమా మాదిరిగానే ఉప్పెన మార్కెట్ కూడా ఉండేది.  కానీ ఓ విభిన్నమైన విషాదఛాయలు ఉన్న పాత్రలో వైష్ణ‌వ్‌ కనిపించబోతుండటం, పైగా హీరో పాత్రలో చాల వేరియేషన్స్ ఉంటాయని టాక్ రావడం.. ముఖ్యంగా సినిమా పాయింట్ మరీ కొత్తగా ఉండబోతుందని తెలుస్తుండటంతో ఈ సినిమాకి భారీ ఆఫర్స్ వస్తున్నాయి. ఓ విషాద వంతమైన ప్రేమ కథకు అదీ  కొత్త  హీరో సినిమాకి భారీ ఆఫర్ రావడం అంటే, అది  వైష్ణ‌వ్‌ తేజ్ కి మాత్రమే దక్కిన క్రెడిట్ అది.  

 

ఇక ఈ సినిమా పాయింట్ కి వస్తే డబ్బు ఉన్న అమ్మాయిని ప్రేమించాడని.. కొట్టి భయపెట్టినా తన ప్రేమను వదిలిపెట్టట్లేదని  ఏకంగా ఆ హీరో  మర్మంగాన్ని కోసేసి అతన్ని పెళ్లికి పనికిరాకుండా చేస్తారట. పాయింట్ వింటుంటేనే మరీ వైల్డ్ గా ఉంది. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి.  అన్నట్టు ఈ సినిమాలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి  కూడా  ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మరి ఈ సినిమాతో ఈ మెగా యంగ్ హీరోకి మెగా హిట్ వస్తోందేమో చూడాలి. హిట్ వచ్చినా రాకపోయినా  ఆల్ రెడీ వైష్ణ‌వ్‌ తేజ్, క్రిష్ దర్శకత్వంలో మరో వినూత్నమైన సినిమా చేస్తున్నాడు.  

Also Read : ‘రకుల్’ పెద్ద పత్తిత్తులా ఫీలైంది.. పాపాలు ఊరికేపోవు !