Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ఎన్.లింగుసామి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది వారియర్’. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి హీరోయిన్ కృతిశెట్టి ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. ఆమె పాత్ర పేరు విజిల్ మహాలక్ష్మి అని రివీల్ చేసింది. ఈ చిత్రంలో అక్షరగౌడ కీలక పాత్రలో నటిస్తుండగా.. ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్, తమిళ హీరో శివకార్తికేయన్ కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో ఉక్రెయిన్ బ్యూటీ మరియా ర్యాబోశాప్క నటించనున్నట్లు సమాచారం. త్వరలో అధికార ప్రకటన వస్తుందని తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూకే నేపథ్య కథతో తీస్తున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్, శాంతి టాకీస్ నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతమందిస్తున్నాడు.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. దీపికా పదుకొణె నటించిన గెహ్రాహియా సినిమాలోని రొమాంటిక్ సీన్లపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘నేనూ కొత్త తరానికి చెందిన మహిళనే. కొత్త తరం, అర్బన్ మూవీస్ పేరుతో దయచేసి చెత్త అమ్మకండి. చెత్త సినిమాలు ఎప్పటికీ చెత్త సినిమాలే. స్కిన్ షో, పోర్నోగ్రఫీ చేసినంత మాత్రాన అవి మంచివి కాలేవు. ఇది అందరికీ తెలిసిన విషయమే’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Also Read: వైరల్ అవుతున్న టుడే క్రేజీ అప్ డేట్స్ !
ఇక మరో అప్ డేట్ ఏమిటంటే.. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకవైపు సినిమాలతో దూసుకుపోతూనే, మరోవైపు కమర్షియల్ యాడ్స్ కూడా వరసగా చేస్తున్నాడు బన్నీ. ఇప్పటికే రాపిడో, ఆహా, శ్రీ చైతన్యకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న అల్లు అర్జున్ ఖాతాలో జొమాటో కూడా చేరింది. ఇప్పుడు మరో షాపింగ్ మాల్ కి కూడా యాడ్ చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: మహేష్ తో కలిసి దుమ్మురేపుతున్న కళావతి
[…] […]