Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న చిత్రం ‘దర్జా’. ఈ చిత్రానికి సలీమ్ మాలిక్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని సునీల్ పాత్రకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ని యాక్షన్ కింగ్ అర్జున్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ చిత్రం మంచి విజయం సాధించి, చిత్రంలో పని చేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా’అని తెలిపారు.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా నటించిన భీమ్లా నాయక్ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఎనిమిది రోజులకుగానూ ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.170 కోట్లు సాధించింది. పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ఈ సినిమా నిలిచింది. ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ లెక్కల ప్రకారం, ఈ చిత్రం రూ.200 కోట్లకు చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది. భీమ్లానాయక్ బాక్సాఫీస్ వసూళ్లను ట్విట్టర్‌లో ఆయన శనివారం ప్రకటించారు.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. మంచు విష్ణు హీరోగా గాలి నాగేశ్వరరావు మూవీ తెరకెక్కనుంది. ఇషాన్ సూర్య డైరెక్ట్ చేస్తున్నాడు. అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందిస్తున్న ఈ మూవీలో విష్ణు సరసన పాయల్ రాజ్‌పూత్ నటించనుంది. స్వాతి అనే పాత్రలో తాను నటిస్తున్నట్లు ఆమె సోషల్ మీడియాలో వెల్లడించింది. ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ మూవీకి కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చనున్నాడు.
ఇక మరో అప్ డేట్ ఏమిటంటే..డీజే టిల్లు సినిమాలో తన పాత్రతో మెప్పించిన హీరోయిన్ నేహా శెట్టిపై ఇటీవల సోషల్ మీడియాలో పలు ట్రోల్స్ వచ్చాయి. తాజాగా వాటిపై స్పందించిన ఈ బ్యూటీ.. ‘మనం ప్రతి ఒక్కరికీ నచ్చాలని లేదు. కొంతమందికి నచ్చవచ్చు. లేకపోతే లేదు. నేను చేసిన రాధికా రోల్ కొంతమందికి నచ్చలేదు. మెజార్టీ ఆడియన్స్ మాత్రం ఇష్టపడ్డారు. అది నాకు సంతోషంగా అనిపించింది’ అని చెప్పింది.