Crazy Update On RRR2: ‘ఆర్ఆర్ఆర్ 2’ పై క్రేజీ అప్ డేట్.. చర్చల్లో ఎన్టీఆర్

Crazy Update On RRR2: ఆర్ఆర్ఆర్ మేనియా ఏ రేంజ్‌లో ఉందో తెలిసిందే. రాజమౌళి మెస్మరైజింగ్‌ మ్యాజిక్‌తో మరోసారి ఇండస్ట్రీ హిట్‌ కొట్టినట్టే అంటున్నారు ట్రేడ్‌ పండితులు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన ఆర్ఆర్ఆర్ కి త్వరలో సీక్వెల్‌ రాబోతోంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ విషయాన్ని ఇటీవలే ఆర్ఆర్ఆర్ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. విజయేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘ఆర్ఆర్ఆర్ – 2’ కి సంబంధించి తమ ఇంట్లో చర్చలు జరిగాయని, […]

Written By: Shiva, Updated On : April 2, 2022 3:43 pm
Follow us on

Crazy Update On RRR2: ఆర్ఆర్ఆర్ మేనియా ఏ రేంజ్‌లో ఉందో తెలిసిందే. రాజమౌళి మెస్మరైజింగ్‌ మ్యాజిక్‌తో మరోసారి ఇండస్ట్రీ హిట్‌ కొట్టినట్టే అంటున్నారు ట్రేడ్‌ పండితులు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన ఆర్ఆర్ఆర్ కి త్వరలో సీక్వెల్‌ రాబోతోంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ విషయాన్ని ఇటీవలే ఆర్ఆర్ఆర్ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

RRR

విజయేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘ఆర్ఆర్ఆర్ – 2’ కి సంబంధించి తమ ఇంట్లో చర్చలు జరిగాయని, చర్చల్లో ఎన్టీఆర్ కూడా పాల్గొన్నారని ఆయన తెలిపారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్‌ చిత్రం కోసం కసరత్తులు చేస్తుండగా, దైవం తలిస్తే ‘ఆర్ఆర్ఆర్ – 2’ తప్పకుండా ఉంటుందని విజయేంద్ర ప్రసాద్‌ అన్నారు. మరి చర్చల్లో ఎన్టీఆర్ కూడా ఉన్నారు అని చెప్పారు కాబట్టి.. మెయిన్ గా ‘ఆర్ఆర్ఆర్ – 2’ను ఎన్టీఆర్ పాత్ర పై కొనసాగిస్తారేమో చూడాలి.

Also Read: Samantha Stunning Look Viral: అందాల ఆరబోతలో దారుణంగా దిగజారిన ‘సమంత’

ఎన్టీఆర్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. పైగా ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ హిట్‌ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరుదైన ఘనత సాధించాడు. 2015లో వచ్చిన టెంపర్ సినిమా నుంచి నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ, అరవిందసమేత, ఆర్ఆర్ఆర్ సినిమాలతో వరుస హిట్‌లు సాధించాడు. వీటిలో ఏ సినిమా కూడా అభిమానులను నిరాశపరచలేదు.

మిగతా టాప్ హీరోల చివరి ఆరు సినిమాల్లో ఏదో ఒక ఫ్లాప్ ఉంది. కానీ ఒక్క ఎన్టీఆర్ కి మాత్రమే వరుస హిట్లు ఉన్నాయి. ఈ లెక్కన ఎన్టీఆర్ ఒక సినిమా కోసం నాలుగేళ్లు సమయాన్ని కేటాయించడం నిజంగా సాహసమే. అయితే.. ఎన్టీఆర్ అంత సాహసం చేస్తే.. రాజమౌళి మాత్రం ఎన్టీఆర్ కి ఇవ్వాల్సిన స్థాయిలో ఎలివేషన్స్ ఇవ్వలేదేమో అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే.. ఎన్టీఆర్ పై జక్కన్న ‘ఆర్ఆర్ఆర్ – 2’ను ప్లాన్ చేస్తున్నారట.

RRR

మరోపక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో మెయిన్ హీరో ఎన్టీఆరే అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. మొత్తానికి ఆర్ఆర్ఆర్ భారీ హిట్ అయ్యింది. మరి ఆ హిట్ ఏ స్థాయికి వెళ్తుందో చూడాలి. ఇక ఈ సినిమాతో ఎన్టీఆర్ నటనా స్థాయి ఏమిటో నార్త్ ప్రేక్షకులకు కూడా బలంగా తెలిసొచ్చింది.

Also Read: Mahesh Babu Rejected Pushpa: మహేష్ ‘పుష్ప‌’ను రిజెక్ట్ చేయ‌డానికి కారణం అదే

Tags