
కొన్ని ఐడియాస్ అనుకున్నామని, చాలా అద్భుతంగా వచ్చాయని, మహేష్ బాబు తో సినిమా పూర్తైన తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తాను అంటూ రాజమౌళి ఈ పలు సందర్భాలలో తెలిపాడు.అయితే ఆస్కార్ అవార్డు గెలిచిన సందర్భంగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది.
రీసెంట్ గా ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన ఇంటర్వ్యూ లో #RRR మూవీ సీక్వెల్ గురించి మాట్లాడుతూ ‘#RRR సీక్వెల్ మొదటి భాగానికి మించి ఉంటుంది.ఆ కథకి కొనసాగింపుగానే ఉంటుంది, ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ మళ్ళీ కలిసి నటించబోతున్నారు.ఇంతకు మించి ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడే ఏమి మాట్లాడను’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు తో చెయ్యబొయ్యే సినిమా గురించి మాట్లాడుతూ ‘ప్రస్తుతం స్క్రిప్ట్ ఫినిష్ దశలో ఉంది, ప్రీ ప్రొడక్షన్ వర్క్ త్వరలోనే ప్రారంభించి,ఈ ఏడాది లోనే మూవీ షూటింగ్ ని ప్రారంభిస్తాము’ అంటూ చెప్పుకొచ్చాడు విజయేంద్ర ప్రసాద్.#RRR మూవీ తో పాన్ వరల్డ్ మార్కెట్ కి తలుపులు తెరిచినా రాజమౌళి మహేష్ బాబు తో చెయ్యబొయ్యే సినిమాతో ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తాడో చూడాలి.