https://oktelugu.com/

Shriya Saran: కాలు పైకెత్తి హాట్ థైస్ కనిపించేలా… చూపించడంలో తెగించిన శ్రియ శరన్!

కెరీర్ కొంచెం నెమ్మదించగానే శ్రియ ప్రేమించినవాడిని వివాహం చేసుకుంది. 2018లో రష్యన్ అయిన ఆండ్రీని శ్రియ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక అమ్మాయి.

Written By:
  • Shiva
  • , Updated On : May 24, 2023 / 09:51 AM IST

    Shriya Saran

    Follow us on

    Shriya Saran: ఒకప్పటి స్టార్ లేడీ శ్రియ శరన్ గ్లామర్ లో కుర్ర భామలకు పోటీ ఇస్తుంది. నాజూకు నడుమందాల శ్రియ నాలుగు పదుల వయసులో కూడా మత్తెక్కిస్తోంది. శ్రియ లేటెస్ట్ బోల్డ్ ఫోటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. థైస్, క్లీవేజ్ షోతో మైండ్ బ్లాక్ చేస్తుంది. శ్రియ తెగింపు హాట్ టాపిక్ అవుతుంది. నటిగా శ్రియ రెండు దశాబ్దాల కెరీర్ పూర్తి చేసుకుంది. ఆమె మొదటి చిత్రం ఇష్టం 2002లో విడుదలైంది. ఇష్టం పర్లేదు అనిపించుకుంది. రెండో చిత్రంతోనే నాగార్జున పక్కన ఛాన్స్ కొట్టేసింది. సంతోషం మూవీతో ఫస్ట్ హిట్ ఖాతాలో వేసుకుంది.

    ఆ వెంటనే చెన్నకేశవరెడ్డి మూవీలో బాలయ్యకు జంటగా ఆఫర్ అందుకుంది. దర్శకుడు వివి వినాయక్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన చెన్నకేశవరెడ్డి సూపర్ హిట్. దాంతో శ్రియ వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. హిట్స్, బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ తో చెలరేగిపోయింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకీ వంటి సీనియర్ స్టార్స్ తో పాటు ఎన్టీఆర్, పవన్, ప్రభాస్, మహేష్ లాంటి ఈ జనరేషన్ స్టార్స్ తో కూడా ఆమె జతకట్టారు.

    కెరీర్ కొంచెం నెమ్మదించగానే శ్రియ ప్రేమించినవాడిని వివాహం చేసుకుంది. 2018లో రష్యన్ అయిన ఆండ్రీని శ్రియ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక అమ్మాయి. కూతురు పుట్టిన విషయాన్ని శ్రియ రహస్యంగా ఉంచింది. లాక్ డౌన్ సమయంలో గర్భం దాల్చిన శ్రియ ఎవరికీ తెలియకుండా తల్లి అయ్యారు. అనంతరం తనకు కూతురు పుట్టిన విషయం లీక్ చేశారు. అలాగే ఒకప్పటి తన బేబీ బంప్ ఫోటోలు బయటపెట్టింది.

    స్టార్ హీరోయిన్ హోదా పోయినప్పటికీ శ్రియకు ఆఫర్స్ తగ్గడం లేదు. ఆమె బిజీగానే ఉన్నారు. ఇటీవల మ్యూజిక్ స్కూల్ టైటిల్ తో ఓ చిత్రం చేశారు. అలాగే ఉపేంద్రకు జంటగా కబ్జ చిత్రంలో నటించారు. కబ్జ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కబ్జ చిత్రానికి సీక్వెల్ ఉందని సమాచారం. మరోవైపు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. హాట్ ఫోటో షూట్స్ తో ఎంటర్టైన్ చేస్తున్నారు.