Sreemukhi: స్టార్ యాంకర్ గా అవతరించిన శ్రీముఖి బుల్లితెర మీద దూసుకుపోతుంది. వివిధ ఛానల్స్ లో అరడజను షోలకు యాంకర్ గా వ్యవహరిస్తోంది. శ్రీముఖి పాపులారిటీ రీత్యా మేకర్స్ ఆమెను సంప్రదిస్తున్నారు. అనసూయ యాంకరింగ్ మానేయడం, సుమ షోలు తగ్గించడం శ్రీముఖికి కలిసొస్తుంది. రష్మీ ఉన్నా ఆమె ఈటీవికి మాత్రమే పరిమితం. ఒకప్పుడు శ్రీముఖికి ఇంత ఫేమ్ లేదు. పటాస్ షోతో వెలుగులోకి వచ్చింది. అయితే బిగ్ బాస్ షో కెరీర్ కి ప్లస్ అయ్యింది.
బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న శ్రీముఖి టైటిల్ కోసం పోటీ పడింది. ఫైనల్ లో రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి నిలిచారు. రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్ కాగా… శ్రీముఖి రన్నర్ పొజీషన్ తో సరిపెట్టుకుంది. అయితే రెమ్యూనరేషన్ గట్టిగా తీసుకుందని సమాచారం. యాంకర్ గా బిజీ అయిన శ్రీముఖికి వెండితెర ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ఇటీవల చిరంజీవితో రొమాన్స్ చేసింది.
భోళా శంకర్ మూవీలో శ్రీముఖి-చిరంజీవి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రంలో భూమిక నడుము చూసే సన్నివేశాన్ని భోళా శంకర్ లో చిరంజీవి, భూమిక స్పూఫ్ చేశారు. భోళా శంకర్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో శ్రీముఖి సన్నివేశాలు విమర్శల పాలయ్యాయి.
ఇక హీరోయిన్ గా శ్రీముఖికి ఆఫర్స్ వస్తున్నాయి. ఆల్రెడీ ఒకటి రెండు చిత్రాల్లో శ్రీముఖి హీరోయిన్ గా చేశారు. క్రేజీ అంకుల్స్ టైటిల్ తో తెరకెక్కిన మూవీలో శ్రీముఖి గ్లామరస్ రోల్ చేసింది. అయితే చిన్నా చితకా చిత్రాల్లో నటించినా ఫలితం లేదని ఆమె భావిస్తున్నారట. అందుకే అవకాశాలు వస్తున్నా రిజెక్ట్ చేస్తున్నారట.
ఆర్థికంగా సెటిల్ అయిన శ్రీముఖి హైదరాబాద్ లో ఇల్లు నిర్మించుకుంది. ఆమె సంపాదన కోట్లలోకి చేరిందని సమాచారం. ఇదిలా ఉంటే… సోషల్ మీడియా వేదికగా అమ్మడు అందాల విందు చేస్తుంది. శ్రీముఖి స్కిన్ షో నెటిజెన్స్ మైండ్ బ్లాక్ చేస్తుంది. తాజాగా ఆరెంజ్ కలర్ ఫ్రాక్ లో బోల్డ్ ట్రీట్ ఇచ్చింది. శ్రీముఖి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram