Allu Arjun : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే అల్లు అర్జున్ కూడా వరుస సినిమాలతో మంచి విజయాలను సాధించినప్పటికి ఈమధ్య ఆయన సినిమాల పరంగా సక్సెస్ లను సాధించినప్పటికి పర్సనల్ విషయాల్లో మాత్రం చాలా గడ్డు పరిస్థితిలను ఎదుర్కొంటున్నాడనే చెప్పాలి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా మంచి విజయాలను సాధిస్తు ముందుకు దూసుకెళుతున్నాయి. పుష్ప 2 సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నారు.ఇక ప్రస్తుతం బాహుబలి సినిమా రికార్డును బ్రేక్ చేసే విధంగా ముందుకు దూసుకెళ్తున్నాడనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు 1500 కోట్ల కలెక్షన్స్ తో ముందుకు సాగుతున్న ఈ సినిమా మరి కొద్ది రోజుల్లో బాహుబలి సినిమా రికార్డు బ్రేక్ చేస్తుందా అంటూ కొంతమంది అభిమానులు వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాకి వచ్చిన ఆదరణ మరియ సినిమాకు రాలేదనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం మనకు తెలిసిందే…ఇక అదే సంఘటన లో శ్రీతేజ్ అనే చిన్నపిల్లాడు కూడా తొక్కిసలాటకు గురయ్యాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది.
హైదరాబాదులో కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న అతను వెంటిలేటర్ల మీద ఉంటున్నాడు… ఇక రీసెంట్ గా సీపీ సివీ ఆనంద్ ఆ పిల్లోడిని చూడటానికి హాస్పిటల్ కి వెళ్ళాడు. ఇక అక్కడ ఆయన పరిస్థితిని తెలుసుకున్న ఆనంద్ పిల్లాడికి జరిగిన ప్రమాదంలో అతడికి బ్రెయిన్ కి ఆక్సిజన్ అందకపోవడంతో అతని బ్రెయిన్ డెడ్ అయిందని ప్రస్తుతానికైతే వెంటిలెటర్ల మీద ఉంటున్నాడు.ఇక అతను కోలుకోవడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉందని ఆనంద్ తెలియజేశారు. మరి ఏది ఏమైనా కూడా గత కొద్ది రోజుల నుంచి ఇది చాలా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ కేసులో భాగంగానే అల్లు అర్జున్ అరెస్టు అయిన విషయం మనకు తెలిసిందే. మరి అంతలోకే హైకోర్టు నుంచి తనకు బెయిల్ వచ్చిన విషయం కూడా మనకు తెలిసిందే…
ఇక ఏది ఏమైనా కూడా ఈ విషయంలో అల్లు అర్జున్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ పిల్లాడికి సంబంధించిన హాస్పిటల్ ఖర్చు మొత్తాన్ని అల్లు అర్జున్ భరిస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ పిల్లాడు పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులతో పాటు అతని అభిమానులు కూడా కొంతవరకు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మరి మొత్తానికైతే పిల్లాడి ఆరోగ్యం సెట్ అయి ఇంటికి వెళ్ళిపోతే చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు…