Dasari Narayanarao: దర్శక దిగ్గజం, దివంగత దాసరి నారాయణ రావు ఇంటికి కోర్టు నోటీసులు ఇచ్చింది. దాసరి నారాయణరావు కుమారులు దాసరి అరుణ్, దాసరి ప్రభులకు సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. వీరిద్దరిపై ఆర్డర్ 34, సీపీసీ సెక్షన్ 151 సిపిసి క్రింద నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశం గా మారింది. వ్యాపార లావాదేవీల్లో భాగంగా తీసుకున్న డబ్బును సరైన సమయానికి చెల్లించక పోవడంతో వీరిపై కోర్టు నోటీసులు అందించిందని తెలుస్తుంది.

ఓ ప్లాంట్ నిర్మాణం కోసం సోమశేఖర్ రావు అనే వ్యాపారి వద్ద నుంచి 2 కోట్ల 11 లక్షల రూపాయలను ప్రభు, అరుణ్‌లు తీసుకున్నారు. ఒప్పందం ప్రకారం తిరిగి డబ్బులు చెల్లించడం లో దాసరి ప్రభు మరియు దాసరి అరుణ్ జాప్యం చేశారు. ఈ నేపథ్యంలోనే సోమ శేఖర్ అనే బాధితుడు సిటీ సివిల్ కోర్టు కోర్టు ను ఆశ్రయించారు. సోమ శేఖర్ పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు… దాసరి కుమారులకు జారీ చేసింది. చెల్లించాల్సిన సొమ్మును నవంబర్ 15వ తేదీలోగా సోమశేఖర్ రావుకి తిరిగివ్వాలని ప్రభు, అరుణ్‌లను ఆదేశించింది కోర్టు.