Homeఎంటర్టైన్మెంట్Couple Friendly Collection: సైలెంట్ గా వచ్చి భారీ ఓపెనింగ్స్ ని దక్కించుకున్న 'కపుల్ ఫ్రెండ్లీ'..మొదటి...

Couple Friendly Collection: సైలెంట్ గా వచ్చి భారీ ఓపెనింగ్స్ ని దక్కించుకున్న ‘కపుల్ ఫ్రెండ్లీ’..మొదటి రోజు గ్రాస్ ఎంతంటే!

Couple Friendly Collection: ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకులను అలరించడానికి చాలా సినిమాలే వచ్చాయి. కానీ నేడు విడుదలైన ‘కపుల్స్ ఫ్రెండ్లీ'(Couple Friendly) చిత్రానికి మాత్రమే అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. విడుదలకు ముందు ఈ సినిమాకు మేకర్స్ ఎలాంటి హడావిడి చేయలేదు, చాలా సైలెంట్ గా విడుదలైంది. హీరో సంతోష్ శోభన్(Santosh Sobhan), హీరోయిన్ మానస వారణాసి(Manasa Varanasi) తమకు తోచిన విధంగా కొన్ని క్యూట్ రీల్స్ చేశారంతే, అంతకు మించి పెద్దగా ప్రొమోషన్స్ కూడా చేయలేదు. అయితే మంచి సినిమాకు ప్రొమోషన్స్ అక్కర్లేదు, కంటెంట్ ఉంటే చాలు, మన తెలుగు ఆడియన్స్ నెత్తిన పెట్టుకొని ఆదరిస్తారు అనడానికి, ఈ సినిమా మరో ఉదాహరణ గా నిల్చింది. ప్రస్తుతం బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు రెండు వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ఫస్ట్ షోస్ నుండి ఈ ట్రెండ్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ఈ చిత్రాన్ని తెలుగు వెర్షన్ తో పాటు తమిళ వెర్షన్ ని కూడా నేడు విడుదల చేశారు. తెలుగు వెర్షన్ థియేట్రికల్ బిజినెస్ విడుదలకు ముందు కేవలం నాలుగు కోట్ల రూపాయలకు మాత్రమే జరిగింది. అదే విధంగా తమిళ వెర్షన్ కోటిన్నర రేంజ్ లో బిజినెస్ జరగ్గా, రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి మరో రెండు కోట్ల రూపాయిలు ఉంటుందని సమాచారం. ఓవరాల్ గా రెండు వెర్షన్స్ కి కలిపి ఈ చిత్రానికి 7.5 కోట్ల రూపాయిల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడం తో మొదటి ఆట నుండే మంచి ఆక్యుపెన్సీలను నమోదు చేసుకోగా, మొదటి రోజు తెలుగు రాష్ట్రాల నుండి కోటి రూపాయలకు పైగానే షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఓవరాల్ గా తమిళ వెర్షన్ తో కలిపి ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రెండున్నర కోటి రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందట.

అంతే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడానికి కేవలం 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే చాలు. పబ్లిక్ మౌత్ టాక్ అదిరిపోవడం తో కచ్చితంగా ఈ సినిమాకు రెండవ రోజున మొదటి రోజు కంటే ఎక్కువ షేర్ వసూళ్లు వస్తుందని బలమైన ధీమా తో ఉన్నారు మేకర్స్. అలా శివరాత్రి లోపు, అనగా ఎల్లుండి లోపు ఈ చిత్రం పూర్తి స్థాయి బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి లాభాల్లోకి అడుగుపెడుతుంది అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఇంకా ఎంత పెద్ద రేంజ్ కి వెళ్తుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version