https://oktelugu.com/

జబర్దస్త్ సుధీర్ కు కరోనా అంటూ వార్తలు.. టెన్షన్ లో ఫ్యాన్స్..?

జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో సుడిగాలి సుధీర్ ఒకరు. సుడిగాలి సుధీర్ అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై టాలెంట్ తో సత్తా చాటుతున్నారు. ఇప్పటికే పలు సినిమాల్లో హీరోగా నటించిన సుధీర్ చేతిలో మరికొన్ని ఆఫర్లు ఉన్నాయి. అయితే సుడిగాలి సుధీర్ కు కరోనా నిర్ధారణ అయిందని సోషల్ మీడియా, వెబ్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం సుడిగాలి సుధీర్ షోలు, ఈవెంట్లతో ఫుల్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 20, 2020 / 07:41 PM IST
    Follow us on

    జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో సుడిగాలి సుధీర్ ఒకరు. సుడిగాలి సుధీర్ అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై టాలెంట్ తో సత్తా చాటుతున్నారు. ఇప్పటికే పలు సినిమాల్లో హీరోగా నటించిన సుధీర్ చేతిలో మరికొన్ని ఆఫర్లు ఉన్నాయి. అయితే సుడిగాలి సుధీర్ కు కరోనా నిర్ధారణ అయిందని సోషల్ మీడియా, వెబ్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు.

    ప్రస్తుతం సుడిగాలి సుధీర్ షోలు, ఈవెంట్లతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే రెండు మూడు రోజుల క్రితం కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారని.. ఆ పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలుస్తోంది. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉండి కరోనాకు చికిత్స చేయించుకుంటున్నారని తెలుస్తోంది. అయితే అధికారికంగా సుడిగాలి సుధీర్ కు కరోనా సోకిందో లేదో స్పష్టత రావాల్సి ఉంది.

    ప్రస్తుతం ఈటీవీలోని పలు షోలతో ఆయన బిజీగా ఉన్నారు. మరోవైపు సుడిగాలి సుధీర్ కు కరోనా సోకితే ఆయన పాల్గొన్న షోలలో ఇతరులు సైతం కరోనా బారిన పడే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మీడియా సుధీర్ నుంచి వివరణ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నా ఆయన అందుబాటులోకి రావడం లేదు. సుధీర్ త్వరగా స్పందించి వివరణ ఇవ్వాలని ఆయన ఫ్యాన్స్ కోరుతున్నారు. మరోవైపు సుధీర్ తో పాటు ఎక్కువ షోలలో రష్మీ పాల్గొంటారు.

    దీంతో రష్మీ కూడా కరోనా పరీక్షలు చేయించుకుంటే మంచిదని పలువురు సూచిస్తున్నారు. అయితే సుడిగాలి సుధీర్ వైపు నుంచి స్పష్టమైన ప్రకటన వస్తే మాత్రమే ఈ వార్తలో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంది