
కరోనా.. కరోనా.. కరోనా.. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఈ పేరే మార్మోగిపోతోంది. చైనాలో సోకిన ఈ మహమ్మరి క్రమంగా ప్రపంచ దేశాలకు పాకింది. భారత్ లోకి కరోనా ఎంట్రీ ఇవ్వడంతోనే కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. ఇటీవల కేంద్రం ఆన్ లాక్ పేరుతో ఒక్కో రంగానికి సడలింపులు ఇస్తూ వస్తోంది.
Also Read: బిగ్ బాస్ లో దొంగ ఓటింగ్
కరోనాతో సినిమారంగం కుదేలైంది. షూటింగులు నిలిచిపోగా.. థియేటర్లు.. మల్టిపెక్స్ మూతపడ్డాయి. ఇటీవలే కేంద్రం వీటిని అనుమతి ఇచ్చింది. షూటింగులు మొదలైనా థియేటర్లు మాత్రం పూర్తి స్థాయిలో తెరుచుకోవడం లేదు. 50శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లు రన్ చేసుకోవాలని కేంద్రం సూచించడంపై థియేటర్ నిర్వాహాకులు మండిపడుతున్నారు.
ఇలా చేయడం వల్ల తమకు నిర్వహాణ ఖర్చులు కూడా రావాలని థియేటర్.. మల్టిపెక్స్ యజమానులు వాపోతున్నారు. దీంతో కొన్నిచోట్ల మాత్రమే థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ దసరా సందర్భంగా టాలీవుడ్ నుంచి దాదాపు 25సినిమాలు షూటింగ్స్.. విడుదలపై అధికారిక ప్రకటన విడుదలవడం ఆసక్తిని రేపుతోంది.
కరోనా క్రైసిస్ లోనూ టాలీవుడ్ నుంచి ఒకేసారి 25సినిమాల ప్రకటన రావడం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వీటిలో ఎన్ని సినిమాలు పూర్తవుతాయో.. ఎన్ని మధ్యలో ఆగుతాయో తెలియదుకానీ లాక్డౌన్ తర్వాత ఇంత భారీ స్థాయిలో సినిమాల ప్రకటన రావడం ఇదే తొలిసారి. కరోనా టైంలోనూ నిర్మాతలు సినిమాలు తీయడానికి వెనుక కారణం ఓటీటీలేనని తెలుస్తోంది.
Also Read: నమ్మక ద్రోహం చేసిన మాస్టర్
కరోనా పరిస్థితులు మున్ముందు ఎలా ఉన్నా.. థియేటర్లు దొరకకపోయినా సరే ఓటీటీలు ఉన్నాయి కదా అనే ధైర్యమే నిర్మాతలను నడిపిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గతంలో శాటిలైట్స్ రైట్స్ కోసం సినిమాలు తీసినట్టే ఇప్పుడు కూడా ఓటీటీల కోసం కొందరు నిర్మాతలు సినిమాలు నిర్మిస్తున్నారనే టాక్ ఇండస్ట్రీలో విన్పిస్తోంది.