Rajinikanth Stardom in Trouble: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ సౌత్ లో విడుదలైన చిత్రాల్లో ఒకటి ‘కూలీ'(Coolie Movie). సూపర్ స్టార్ రజినీకాంత్(Super star Rajinikanth), లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి నుండి అంచనాలు భారీగానే ఉండేవి. అంతే కాకుండా ఈ సినిమా నుండి వచ్చిన పాటలు, మరియు ఇతర ప్రమోషనల్ కంటెంట్ కూడా పెద్ద హిట్ అవ్వడం తో ఆ అంచనాలు పదింతలు రెట్టింపై, కచ్చితంగా ఈ చిత్రం తమిళం నుండి మొట్టమొదటి వెయ్యి కోట్ల గ్రాసర్ గా నిలుస్తుందని అంతా అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ సినిమా తప్ప మరో ఛాన్స్ లేదు. ఉన్నది ముగ్గురు స్టార్ హీరోలు మాత్రమే. అజిత్ భారీ సినిమాలు చేయడం లేదు, విజయ్ ‘జన నాయగన్’ తో సినిమాలు పూర్తిగా ఆపేస్తున్నాడు. ఆ సినిమా కి కూడా వెయ్యి కోట్లు కొట్టే అంత స్టామినా లేదు.
కూలీ కి అన్ని భాషల్లోనూ సమానమైన క్రేజ్ ఉంది కాబట్టి, ఈ సినిమా కచ్చితంగా వెయ్యి కోట్లు కొడుతుందని అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఈ చిత్రానికి మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది. ఆ టాక్ ప్రభావం మొదటి వీకెండ్ పై పెద్దగా పడలేదు కానీ, లాంగ్ రన్ లో మాత్రం చాలా బలంగా పడింది. ముఖ్యంగా తమిళనాడు లో అయితే వసూళ్లు అసలు ముందుకు కదలడం లేదు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి అక్కడ 148 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఆ ప్రాంతం లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కచ్చితంగా 240 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సిందే. కానీ వంద కోట్ల గ్రాస్ నష్టం తోనే ముగిసింది. ఈ ఏడాది విడుదలైన అజిత్ కుమార్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రానికి 151 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లో ‘కూలీ’ లో ఉన్నట్లుగా భారీ తారాగణం లేదు. కేవలం అజిత్ కుమార్ పేరు మీద వచ్చిందే. అధిక్ రవిచంద్రన్ ఈ చిత్రాన్ని కేవలం అజిత్ ఫ్యాన్స్ కోసమే తీర్చి దిద్దారు. మామూలు ఆడియన్స్ ఈ సినిమాను పెద్దగా నచ్చకపోయినా, కేవలం ఫ్యాన్ బేస్ కారణంగా ఆడింది . అలాంటి సినిమా ముందు కూలీ తగ్గడం రజినీకాంత్ ఫ్యాన్స్ ని తీవ్రమైన దిగ్బ్రాంతికి గురి చేసింది. ఒకప్పుడు తమిళనాడు అనే పేరు తీస్తే మనకు గుర్త వచ్చేది రజినీకాంత్. అలాంటి స్థాయిని ఎంజాయ్ చేసే హీరో ఇప్పుడు తమిళనాడు లో ఇలా పడిపోవడం దురదృష్టకరమని అంటున్నారు. పోనీ ఈ సినిమా మిగిలిన ప్రాంతాల్లో తక్కువ వచ్చాయా అంటే లేదు. ప్రపంచవ్యాప్తగా ఇప్పటి వరకు 520 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కేవలం తమిళనాడులోనే కథ అడ్డం తిరిగింది. ఎందుకు ఇలా అయ్యిందంటారు?, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపం లో తెలియజేయండి.