Chhaava: కొన్నాళ్లుగా ముస్లిం కమ్యూనిటీకి వ్యతిరేకంగా చిత్రాలు తెరకెక్కుతున్నాయంటూ చర్చ మొదలైంది. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ది కాశ్మీర్ ఫైల్స్ తీవ్ర వివాదాలు రాజేసింది. కాశ్మీర్ పండిట్స్ పై ముస్లింలు దాడులు చేశారు. అక్కడి బ్రాహ్మణులు హింసకు గురయ్యారనే కోణంలో ది కాశ్మీర్ ఫైల్ రూపొందిచారు. మత విద్వేషాలు రాజేసేదిగా ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ ఉందని ఓ వర్గం వాదించింది. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి చిత్రాలు చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.
కేరళ ఫైల్స్ సైతం అలాంటి చిత్రమే అన్నారు. కేరళలో గల హిందూ అమ్మాయిలను లవ్ జిహాద్ పేరిట ముస్లిం కుర్రాళ్ళు ట్రాప్ చేస్తున్నారని ఆ మూవీ సారాంశం. తాజాగా చావా మూవీ కూడా ఇదే తరహా ఆరోపణలకు గురి అవుతుంది. చావా మూవీ శివాజీ సావంత్ రాసిన చావా అనే నవల ఆధారంగా రూపొందించారు. విక్కీ కౌశల్, రష్మిక మందాన ప్రధాన పాత్రలు చేశారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ కథనే చావా చిత్రం. మొఘలులపై ఆయన వీరోచిత పోరాటాన్ని చావా చిత్రంలో చూపించనున్నారు.
చావా మూవీ ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఇటీవల ట్రైలర్ వదిలారు. ట్రైలర్ వివాదాస్పదం అవుతుంది. ఇది మరో ప్రాపగాండా చిత్రం. రాజకీయ ప్రయోజనాల కోసం ఓ వర్గాన్ని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం అంటున్నారు. చరిత్రను వక్రీకరించి మొఘలులను మరింత క్రూరంగా చూపించారు. తద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని అంటున్నారు. రాజకీయ పార్టీల మధ్య చావా మూవీ ట్రైలర్ మాటల యుద్ధానికి దారి తీసింది.
విడుదలకు ముందే చావా మూవీ కాంట్రవర్సీకి కేంద్రంగా మారింది. రానున్న కాలంలో ఎలాంటి విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే ఆందోళనలు మొదలయ్యాయి. కాగా చావా చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకుడు. దినేష్ విజన్ నిర్మించారు. చావా చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం విశేషం. చావా ట్రైలర్ ఆకట్టుకోగా అంచనాలు పెరిగాయి. విక్కీ కౌశల్, రష్మిక ల లుక్స్, గెటప్స్, నటన ఆకట్టుకున్నాయి.
