Homeఎంటర్టైన్మెంట్Case Filed Against Sai Pallavi: సాయిపల్లవిపై కేసు.. రంగంలోకి హిందుత్వ సంఘాలు.. వదిలేలా లేవే!

Case Filed Against Sai Pallavi: సాయిపల్లవిపై కేసు.. రంగంలోకి హిందుత్వ సంఘాలు.. వదిలేలా లేవే!

Case Filed Against Sai Pallavi: సాయిపల్లవి పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఆ పేరుకి ప్రత్యేక అభిమానులు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అరుదైన లేడీ పవర్ స్టార్ అన్న ఇమేజ్ ను దక్కించుకున్నారంటే ఆమె క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. న్యాచురల్ బ్యూటీ, న్యాచురల్ నటి, తిరుగులేని డ్యాన్సర్ ఎవరయ్యా అంటే.. అందరూ చెప్పే పేరు సాయిపల్లవే. చేసింది చాలా తక్కువ చిత్రాలే అయినా.. ఆ చిత్రాలతోనే స్టార్ హీరోయిన్ స్టేటస్‌ని ఆమె సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె నటించిన ‘విరాటపర్వం’ చిత్రం విడుదలైంది. అటువంటి సాయిపల్లవి తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. హిందుత్వ సంఘాల ఆగ్రహానికి గురయ్యారు. హిందూ సెంటిమెంట్స్‌ని గాయ‌ప‌రిచార‌ంటూ ఆమెపై పోలీసు కేసులు సైతం నమోదయ్యాయి. అయితే గతంలో అమీర్ ఖాన్, ప్రకాష్ రాజ్ వంటి వారు చేసిన చిన్నచిన్న కామెంట్స్ సైతం వివాదాస్పదమయ్యాయి. వారి సరసన సాయిపల్లవి చేరడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Case Filed Against Sai Pallavi
Sai Pallavi

ఆమె తప్పేమిటంటే..
ఇంత‌కీ ఆమె చేసిన తప్పేమిటంటే కశ్మీర్ ఫైల్స్ సినిమాపై కామెంట్స్ చేయడమే. ఆ సినిమా తాను చూశానని.. అందులో తీవ్ర‌వాదులు పండిట్స్‌ని చంప‌డం ఎంత త‌ప్పో, ఆవుల్ని త‌ర‌లిస్తున్నార‌ని ఒక వ్య‌క్తిని కొట్టి చంప‌డం కూడా అంతే త‌ప్పుగా అభివర్ణించింది. చంప‌డం త‌ప్ప‌ని చెప్పిందే త‌ప్ప‌, గోర‌క్ష‌కుల‌పై ఆమె వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌లేదు. త‌న‌కి లెఫ్ట్‌, రైట్ లేద‌ని, న్యూట్ర‌ల్ ఫ్యామిలీలో పెరిగాన‌ని చెప్పారు.మతం పేరుతో హింస త‌ప్ప‌ని, మ‌నం మంచిగా వుండాల‌ని చెప్పింది. దీంతో ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీనిపై భజరంగదళ్ కార్యకర్తలు ఎక్కడికక్కడే నిరసనలు తెలిపారు. కాశ్మీరి తీవ్రవాదులతో గోరక్షకులను పోల్చడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం వివాదాస్పదమవుతోంది.

Also Read: Pavan Kalyan Third Wife Assets: పవన్ మూడో భార్య పేరిట ఎన్ని ఆస్తులున్నాయి?

Case Filed Against Sai Pallavi
Sai Pallavi

ధైర్యంగా మాట్లాడగల నేర్పరి..
సాయిపల్లవి ముక్కుసూటి మనిషి. ఏ విషయాన్నైనా ధైర్యంగా చెప్పగలరు. తన మనోభావాలకు విరుద్ధంగా ఆమె వ్యవహరించరు. అందుకే చాలా అవకాశాలు వచ్చినా వదులుకున్నారు. గ‌తంలో కొన్ని యాడ్స్‌లో న‌టించ‌డానికి తిర‌స్క‌రించారు. 2 కోట్ల పారితోషికం వ‌దులుకున్న సందర్భాలున్నాయి. ఫెయిర్‌నెస్ క్రీం యాడ్స్‌లో తాను న‌టించ‌ను అని తెగేసి చెప్పారు. రంగు పుట్టుక‌తో వ‌స్తుంద‌ని, ఫ‌లానా రంగు చర్మం గొప్ప‌ద‌నే అభిప్రాయం త‌న‌కు లేద‌ని చెప్పింది. అయితే కశ్మీర్ పండిట్స్ సినిమా విషయంలో ఆమె నోటి నుంచి యధాలాపంగా వ్యాఖ్యలు వచ్చావో.. లేకుంటే తన అభిప్రాయాన్ని వెల్లడించడంలో తప్పు దొర్లిందో కాని ఇప్పుడామె వార్తల్లోకెక్కారు. శుక్రవారం ఆమె నటించిన విరాటపర్వం విడుదలైంది. నక్సలైట్ యువతిగా, అభ్యుదయ భావాలు కలిగే పవర్ ఫుల్ పాత్రలో ఆమె నటిస్తున్నారు. తాజాగా నెలకొన్న ఈ వివాదం సినిమాకి మేలు చేస్తుందో, చేటు చేస్తుందో చూడాలి. ప‌నిలో ప‌నిగా విరాట‌ప‌ర్వం టైటిల్‌పైన కూడా సెన్సార్ బోర్డుకి భ‌జ‌రంగ‌ద‌ళ్ ఆక్షేప‌ణ తెలిపింది.

Also Read:Virata Parvam Movie Review: విరాటపర్వం మూవీ రివ్యూ..

Recommended Video:

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular